ఏపీలోని కూటమి సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ పేరిట నయా పాలనాజి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ కొత్త సేవలను ప్రారంభించారు. యువగళం పేరిట లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు… ప్రత్యేకించి విద్యార్థులు నుంచి వినిపించిన సమస్యల పరిష్కారం కోసమే ఆయన ఈసేవలను ప్రారంభించారు.
ఇటీవలే లోకేష్ చేతుల మీదుగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం అయిన సంగతి తెగెలిసిందే. గురువారం ఇంటర్మీడియట్ పరీక్షలకు సంభందించిన హాల్ టికెట్ లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం విడుదల చేసింది. అంటే… ఇంటర్ విద్యార్థులు తమ హాల్ టికెట్ ల కోసం ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగులు పెట్టాల్సిన పని లేదు. ఎంచక్కా… తమ మొబైల్ ఫోన్ల ద్వారానే వారు తమ హాల్ టికెట్ లను పొందవచ్చు. వెరసి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులకు శ్రమ తగ్గిపోయిందని చెప్పాలి.
ఏపీలో ఇంటర్ పరీక్షలు మర్చి 1 నుంచి మర్చి 20 వరకు జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు…మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ లో ఇంటర్ హాల్ టికెట్ లను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలన్న విషయానికి వస్తే.. విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ ల నుంచి కింది విధంగా హాల్ టికెట్ లను పొందవచ్చు.
1. ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్కి హాయ్ (Hi) అని వాట్సప్లో మెసేజ్ చేయగానే, సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది.
2. ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి. అందులో విద్య సేవలపై క్లిక్ చేయాలి.
3. అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్పై క్లిక్ చేయగానే, ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది.
4. దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్లోనే ఎంతో సింపుల్గా డౌన్లోడ్ అవుతుంది.
This post was last modified on February 7, 2025 12:12 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…