అధికారంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు సహజం. ఎంత బాగా పాలన చేశామని చెప్పుకొన్నా.. ఎంత విజన్‌తో దూసుకుపోతున్నామని చెప్పుకొన్నా.. ఎక్కడో తేడా కొడుతూనే ఉంటుంది. దీనిని ఎవరూ కాదన లేరు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా అతీతులేమీ కాదు. ఏడు మాసాల పాలన పూర్తయ్యే సరికి.. ఆయనకు కూడా.. కొంత ఇబ్బంది ఎదురవుతోంది. ఈ ఆరు మాసాల కాలంలో ఆయన ప్రతి నెలా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేసేందుకు వెళ్లినా.. ఎవరూ మాట్లాడలేదు. కానీ, ఏడో నెలకు వచ్చే సరికి సూపర్ సిక్స్‌పై ప్రశ్నలు వచ్చాయి.
ఈ ఒక్కటే కాదు.. పలు విషయాలు కూడా చంద్రబాబుకు ఇబ్బందిగా మారాయి. అయితే.. ఆయన ఇలాంటి వాటి నుంచి కూడా చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. దీనికి ప్రధానంగా ఐదు సూత్రాలు ఆయన కు కలిసి వస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. వాటిని ఆలంబన చేసుకుని చంద్రబాబు సేఫ్, సేవ్ అవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. 1) మాట తీరు. 2) సీనియర్ సీఎం. 3) విజన్ ఉన్న నాయకుడు. 4) విపక్షం బలంగా లేకపోవడం. 5) కలిసి వస్తున్న కూటమి నేతలు.
ఈ ఐదు సూత్రాలతో చంద్రబాబు తనకు ఎదురవుతున్న ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కొంటున్నార ని పరిశీలకులు చెబుతున్నారు. మాట తీరు విషయంలో చంద్రబాబును మించిన వారు లేరు. వ్యతిరేకతను కూడా తనకు అనుకూలంగా మలుచుకోగల ధీశాలి. ఏ విషయాన్నయినా.. తిప్పికొట్టే నైపుణ్యం ఆయనలో ఉంది. ఇక, రెండోది సీనియర్ సీఎం.. ఈ విషయంలో ఆయన పాలనను బలంగా తీసుకువెళ్తున్నారు. వచ్చే విపత్తులను ముందుగానే అంచనా వేస్తున్నారు. తనే స్పందిస్తున్నారు. తద్వారా గొడ్డలిదాకా రాకుండా.. గోటితోనే తీసేస్తున్నారు.
విజన్ ఉన్న నాయకుడిగా పేరుండడంతో చంద్రబాబు పట్ల మధ్యతరగతి, పారిశ్రామిక, ఉన్నత స్థాయి వర్గాలు సానుకూలంగా ఉన్నాయి. చిన్నపాటి లోపాలను వారే సరిదిద్దుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక, విపక్షం బలంగా లేకపోవడం మరింతగా చంద్రబాబుకు కలిసి వస్తోంది. ఏం చేసినా విమర్శలు గుప్పించి… యాగీ చేస్తున్న విపక్షాన్ని చాలా రాష్ట్రాల్లో చూస్తున్న దరిమిలా.. ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. అసలు వైసీపీ నాయకులు ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. ఇక, చివరిది.. కూటమి నేతలు.. ప్రధానంగా పవన్ కల్యాణ్, బీజేపీలు.. కలిసి వస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ఎదురవుతున్న ఇబ్బందులు దూది పింజల్లా తేలిపోతున్నాయనే చెప్పాలి.
This post was last modified on February 7, 2025 9:50 am
హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ…
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్‌కు అనుకున్న ఆ చిత్రం…
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…
ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…