ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగైనా అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని ఆప్ అనుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం అంచనాలకు మించింది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పోలింగ్ పూర్తయ్యే సరికి ఆ శాతం దాదాపు 61కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
2020 ఎన్నికలతో పోలిస్తే 13 శాతం పోలింగ్ అధికరంగా జరిగే చాన్స్ ఉంది. అయితే, ఆ పెరిగిన ఓట్ల శాతం ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం అన్నది తేలాల్సి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ, ఆప్ ల మధ్య గట్టిపోరు తప్పదని దాదాపుగా మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ అఖండ విజయాన్ని పక్కాగా అంచనా వేసిన కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆప్ గెలుపును తేల్చేశాయి. ఈ ఎన్నికల్లో ఆప్ 39, బీజేపీ 22 సీట్లు దక్కించుకుంటాయని కేకే సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో ఈ ఫలితాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండడంతో ఆప్ నేతలు తమ గెలుపు ఖాయమని అనుకుంటున్నారు. అయితే, చాణక్య స్ట్రాటజీస్ మాత్రం బీజేపీ 51-60 సీట్లతో అధికారం చేపడుతుందని తేల్చింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు:
పీపుల్స్ పల్స్: బీజేపీ 51-60, ఆప్ 10-19
ఏబీపీ మ్యాట్రిజ్: బీజేపీ 35-40, ఆప్ 32-37
ఆత్మసాక్షి: బీజేపీ 38-41, ఆప్ 27-30, కాంగ్రెస్ 1-3
చాణక్య స్ట్రాటజీస్: బీజేపీ 39-44, ఆప్ 25-28
ఢిల్లీ టౌమ్స్ నౌ: బీజేపీ 39-45, ఆప్ 22-31
This post was last modified on February 6, 2025 7:41 am
చిన్నపిల్లాడిగా ఉండగా రుద్రమదేవి.. టీనేజీలో నిర్మలా కాన్వెంట్ సినిమాలు చేసిన శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా.. ఆ తర్వాత పెళ్ళిసందడి…
జన నాయకుడు ట్రైలర్ వచ్చాక అందరి డౌట్లు తీరిపోయాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం…
తెలంగాణ శాసన సభ శీతాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఇరిగేషన్ ప్రాజెక్టుల…
తెలుగులో కామెడీ బాగా డీల్ చేయగల దర్శకుల్లో మారుతి ఒకడు. అతను తీసిన చిత్రాల్లో చాలా వరకు ఎంటర్టైనర్లే. ‘భలే…
తెలంగాణలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దీనిలో అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. ఇక, దీనికి ముందు.. జూబ్లీహిల్స్…
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం.. బీజేపీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు…