Political News

నిజంగా అవ‌మానం: మోడీ మిత్రుడు ఇలా చేయ‌డ‌మేంటి?!

అగ్ర‌రాజ్యం అమెరికాలో నూత‌న అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్పుడు.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మురిసిపోయారు. “నా ప్రియ మిత్రుడికి శుభాకాంక్ష‌లు” అని సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు. అంతేకాదు.. మ‌రుస‌టి రోజు ఫోన్ చేసి.. ట్రంప్‌ను అభినందించారు. దీనిని కూడా ప్ర‌జ‌లకు వివ‌రించారు. ప్రియ మిత్రుడి కార‌ణంగా.. అమెరికా-భార‌త్ బంధం మ‌రింత బ‌ల ప‌డుతుంద‌న్నారు. క‌ట్ చేస్తే.. ట్రంప్ ప్ర‌మాణం చేసి ప‌ట్టుమ‌ని 15రోజులు కూడా కాక‌ముందే.. భార‌త్‌కు అవ‌మాన క‌ర‌మైన ప‌నిచేశారు.

అక్ర‌మంగా అమెరికాలోకి ప్ర‌వేశించారంటూ.. ఇత‌ర దేశాల‌కు చెందిన వారిని అగ్ర‌రాజ్యం నుంచి రాత్రికి రాత్రి త‌రిమేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇలా వీరిని వ‌దిలించుకునే క్ర‌మంలో క‌నీసం మాన‌వ హ‌క్కుల‌ను కూడా ట్రంప్ పట్టించుకోవ‌డం లేదు. అక్ర‌మ వ‌ల‌స‌దారుల చేతుల‌కు సంకెళ్లు వేసి.. వారిని ఆర్మీ విమానాల్లో ఇత‌ర దేశాల‌కు పంపిస్తున్నారు. వీరికి దారిలో క‌నీసం మంచి నీళ్లు కానీ, ఆహారం కానీ ఇవ్వ‌డం లేదు. దీనిని ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం ఖండించింది.

కానీ, ఇప్పుడు ఆ అనుభ‌వం.. నేరుగా భార‌త్‌కే ఎదురైంది. అమెరికాలో ఉంటున్న అక్ర‌మ వ‌ల‌స‌దారులుగా ముద్ర‌ప‌డిన భారతీయుల‌ను కూడా ట్రంప్ ఇలానే మ‌న దేశానికి పంపించారు. కానీ, ఈ స‌మ‌యంలో భార‌తీయుల‌కు కూడా బేడీలు వేసి.. ఆర్మీ వాహ‌నంలోనే పంపించ‌డం వివాదానికి దారి తీసింది. మోడీ త‌న‌కు ఎంతో కావాల్సిన మిత్రుడు అని ట్రంప్‌కూడా పేర్కొన్న ద‌రిమిలా.. ఇలా మిత్ర దేశానికి చెందిన పౌరుల‌ను కూడా ఘోరంగా అవ‌మానిస్తారా? అన్న ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

మ‌రోవైపు.. కాంగ్రెస్ పార్టీ మోడీ వ్య‌వ‌హారంపై నిప్పులు చెరుగుతోంది. “మోడీ గారు సంగ‌మంలో స్నానం చేస్తున్నారు. ఆయ‌న క‌ళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. కానీ.. మోడీ ప్రియ‌మిత్రుడు ట్రంప్ మాత్రం భార‌తీయుల‌ను చేతులు క‌ట్టేసి.. భార‌త్‌కు త‌రిమేశారు. ఇదీ.. మోడీ పాల‌న‌లో భార‌తీయుల దుస్థితి” అని కాంటమెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. తాజాగా అమెరికా.. సుమారు 600 మందికిపైగా భార‌తీయుల‌ను అక్ర‌మ వ‌ల‌స‌ద‌రులుగా పేర్కొంటూ వెన‌క్కి పంపుతోంది.

This post was last modified on February 5, 2025 3:01 pm

Share
Show comments
Published by
Satya
Tags: ModiTrumpUSA

Recent Posts

రమేష్ బాబు కామెంట్ – బండ్ల గణేష్ కౌంటర్

ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు…

2 minutes ago

టీడీపీలో ‘మంగ్లి’ మంటలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త…

6 minutes ago

ఓటమి కాస్తా.. ఓదార్పు యాత్ర అయ్యిందే!

తిరుపతి నగరపాలక సంస్థలో మంగళవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి అయిపోయిన తర్వాత ఎందుకనో గానీ వైసీపీలో ఏడుపులు,…

18 minutes ago

పవన్ కాల్ షీట్లు వేస్ట్ అయ్యాయా?

పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రాధాన్యం తగ్గించేసి చాలా కాలం అయింది. 2019 ఎన్నికలకు ముందు సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని…

48 minutes ago

‘స్థానికం’లో జ‌న‌సేన త‌ప్పుకొంది.. రీజ‌నేంటి ..!

స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించి చైర్ ప‌ర్స‌న్‌, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వుల‌కు సంబంధించిన పోటీ తీవ్ర‌స్థాయిలో జ‌రిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం…

52 minutes ago

బన్నీ – దేవి : ఆరు మెలోడీల లవ్ స్టోరీ

అల్లు అర్జున్‌కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్…

1 hour ago