టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఆయన 4 గంటల వరకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీతో పాటు ఏపీకి చెందిన బీజేపీ, జనసేన ఎంపీలు లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి లోకేశ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు. వైష్ణవ్ తో భేటీ కోసమే లోకేశ్ ఢిల్లీ టూర్ కి వెళ్లినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే… రాజకీయ వ్యూహాల్లో నిష్ణాతుడిగా పేరు గడించిన ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలో లోకేశ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ టూర్ లో భాగంగా ఏపీ సీఎం అధికారిక నివాసం అయిన 1 జన్ పథ్ లోనే లోకేశ్ బస చేశారు. ఈ క్రమంలో 1 జన్ పథ్ కు వచ్చిన ప్రశాంత్ కిశోర్… లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన తీరు చూస్తుంటే… ఈ మీటింగ్ ప్రీ ప్లాన్ మీటింగేనని అర్థం అవుతోంది. లోకేశ్ టీం నుంచి సమాచారం అందుకున్న ప్రశాంత్ కిశోర్ నేరుగా 1 జన్ పథ్ కు వచ్చి లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారి మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది తెలియాల్సి ఉంది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు జనమంతా వైసీపీ తిరిగి అధికారం చేపడుతుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నా… ప్రశాంత్ కిశోర్ మాత్రం జగన్ కు ఈ దఫా ఓటమి తప్పదని తనదైన శైలి విశ్లేషణలు వెల్లడించారు. ఈ విశ్లేషణలు నిజమేనన్నట్లుగా ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోగా… టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. ఐప్యాక్ ను ప్రశాంత్ కిశోరే స్థాపించినా.. ప్రస్తుతం దానికి ఆయన దూరంగా ఉన్నారు. పీకే శిష్యుడు రాబిన్ శర్మ దానిని నడిపిస్తున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు నుంచి కూడా రాబిన్ శర్మ టీడీపీకి సేవలు అందించారు. ఈ క్రమంలో తాజాగా లోకేశ్ తో పీకే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
This post was last modified on February 4, 2025 8:58 pm
అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉందన్నట్టు ఈ సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఒకరితో అనుకున్నది మరొకరితో…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన… 2023 ఎన్నికల్లో…
వైసీపీ అధినేత జగన్.. లండన్ పర్యటనను ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. సుమారు 15-20 రోజుల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు…
హనుమాన్ బ్లాక్ బస్టర్ రిలీజై ఏడాది దాటేసింది. ఇప్పటిదాకా దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా మొదలుకాలేదు. జై హనుమాన్…
పవన్ కళ్యాణ్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు విడుదల మార్చి 28 అని టీమ్ పదే పదే…
దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగి ఈ ఏడాది జూన్ - జూలై నాటికి.. తొమ్మిదేళ్లు అవుతుంది. అవినీతి, అక్రమాలు,…