అధికార పక్షం ముందు ప్రతిపక్షం బింకంగానే ఉంటుంది. అది కేంద్రమైనా.. రాష్ట్రమైనా.. ఒక్కటే రాజకీయం. మంచి చేసినా.. చెడు చేసినా.. అధికార పక్షంపై ప్రతిపక్షం సహజంగానే నిప్పులు చెరుగుతుంది. ఒకవేళ తమ తప్పే ఉన్నా.. ప్రతిపక్షాలు అంగీకరించ వు.పైగా ఎదురుదాడి చేస్తాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి రాజకీయమే జరుగుతోంది. అంతెందుకు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి రాజకీయాలు సహజం. అసలు ప్రతిపక్షం ఉన్నదే సర్కారు తప్పులు ఎత్తి చూపేందుకు తప్ప.. తమ తప్పులు ఎంచేందుకు కాదు! అయితే.. తాజాగా రాహుల్ గాంధీ.. తనకు ప్రథమ ప్రత్యర్థి అయిన మోడీ ముందు.. ‘ఔను మేం తప్పు చేశాం’ అని ఒప్పుకొన్నారు.
ఇది చిత్రం కాదు. నిజమే. లోక్‌సభలో సోమవారం ప్రసంగించిన రాహుల్ గాంధీ.. నిరుద్యోగ సమస్యపై స్పందించారు. దేశంలో నిరుద్యోగం మర్రిచెట్టు ఊడల్లా దిగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనికి అడ్డుకట్ట పడడం లేదన్నారు. ఇదేసమయంలో గత కాంగ్రెస్ హయాంలోని యూపీఏ ప్రభుత్వం రెండు టెర్మ్‌ల్లోనూ.. కూడా నిరుద్యోగంపై సరైన విధంగా తాము దృష్టి పెట్టలేక పోయామని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. దీని వల్ల నిరుద్యోగం మరింత పెరిగిందన్నారు. “ఔను. ఈ విషయాన్ని చెప్పేందుకు నేను బాధ పడడం లేదు. గత యూపీఏ హయాంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేక పోయాం” అని రాహుల్ అన్నారు.
ఈ సమయంలో ప్రధాన మంత్రి మోడీ.. సభలోనే ఉన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ముసిముసిగా నవ్వుకున్నారు. అయితే.. అనంతరం రాహుల్.. ప్రస్తుత మోడీ సర్కారు కూడా నిరుద్యోగాన్ని పరిష్కరించలేక పోతోందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రధాని చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం బాగుందన్న రాహుల్.. ప్రధాని ఈ కార్యక్రమం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ విషయంలో తాను ప్రధానిని తప్పుబట్టడం లేదన్నారు. కానీ, మేకిన్ ఇండియా మాత్రం విఫలమైందన్నారు. మొత్తానికి తాజాగా పార్లమెంటులో రాహుల్ చేసిన ప్రసంగం ఆసాంతం.. కొంత సుతిమెత్తగా సాగిందనే చెప్పాలి. కారణాలు ఏవైనా.. రాహుల్ మెత్తబడ్డారన్న విషయంపై కాంగ్రెస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on February 4, 2025 9:59 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…