Political News

‘ఫామ్‌హౌస్ సోది మాకొద్దు.. ద‌మ్ముంటే అసెంబ్లీకి రా!’

తెలంగాణ‌లో మ‌రోసారి రాజ‌కీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్‌రెడ్డి స‌ర్కారుపై బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్రాజెక్టుల‌పై యుద్ధం ప్ర‌క‌టిస్తున్నాన‌ని.. ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని కేసీఆర్ చెప్పిన నేప‌థ్యంలో తాజాగా సీఎం రేవంత్ మాట‌కు మాట అన్న‌ట్టుగా స్పందించారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని సోది చెప్ప‌ద్దంటూ చుర‌క‌లు అంటించారు. అస‌లు కేసీఆర్ హ‌యాంలో జ‌రిగిందేంటో లెక్క‌ల‌తో స‌హా వివ‌రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని.. త్వ‌ర‌లోనే బ‌డ్జెట్ స‌మావేశాలు ఉన్నాయ‌ని, ద‌మ్ముంటే అసెంబ్లీకి రావాల‌ని ఆయ‌న సవాల్ రువ్వారు.

ఏం జ‌రిగింది?

శుక్ర‌వారం ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌.. పార్టీ నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేవ‌లం ఆర్భాటం చేస్తోంద‌ని.. ప్ర‌చారానికి ఎక్కువ‌-ప‌నికి త‌క్కువ అని త‌న‌దైన శైలిలో విమ‌ర్శించారు. కాళేశ్వ‌రం స‌హా ఇత‌ర ప్రాజెక్టుల‌ను పండ‌బెట్టార‌ని (అభివృద్ధి లేద‌ని) వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో ప్రాజెక్టుల‌పైయుద్ధం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. తాను పిబ్ర‌వ‌రిలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. బ‌హిరంగ స‌భ పెడుతున్నాన‌ని కూడా తెలిపారు. ఈ క్ర‌మంలో రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం స్పందించారు. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని కొంద‌రు సోది చెబుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ పాల‌న‌లో రాష్ట్రం అప్పుల ఊబిలోకి జారుకుంద‌న్నారు. మిగులు రాష్ట్రంలో పాల‌న మొద‌లు పెట్టిన కేసీఆర్‌… రాష్ట్రాన్ని 7 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఊబిలోకి దించి వెళ్లిపోయార‌ని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల‌ను ఆదుకుంటామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన గ‌త ప్ర‌భుత్వం కేవ‌లం 18 వేల కోట్ల మేర‌కే రుణ మాఫీ చేసింద‌న్నారు. ఇది కూడా రైతుల చేతికి ఏమీ అంద‌లేద‌ని.. అది వ‌డ్డీల‌కే స‌రిపోయింద‌ని వ్యాఖ్యానించారు. తాము అధికారం చేప‌ట్టిన కేవ‌లం రెండు మాసాల్లోనే ఒక్కొక్క రైతుకు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున రుణ మాఫీ చేసిన‌ట్టురేవంత్రెడ్డి వివ‌రించారు. ఈ లెక్క‌లు త‌ప్ప‌ని నిరూపించ‌గ‌ల‌రా? అని కేసీఆర్ ను ప్ర‌శ్నించారు.

“అసెంబ్లీకి రా! ఎంత రుణ మాఫీ చేశామో.. లెక్క‌ల‌తో స‌హా వివ‌రిస్తాం. గ‌త ప్ర‌భుత్వం ఎంత రుణ మాఫీ చేసిందో కూడా లెక్క‌లు చూపిస్తాం” అని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్‌కే కాదు.. ఆయ‌న మాట‌ల‌కు కూడా నిజాయితీ… చిత్త‌శుద్ధి లేవ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతు భ‌రోసా ఎగ్గొట్ట‌డానికి.. కేసీఆర్ పాల‌న కాద‌ని… కాంగ్రెస్ పాల‌న అని చెప్పారు. ఎన్నిక‌ల కుముందు ఇచ్చిన ప్ర‌తి గ్యారెంటీని తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేసి తీరుతామ‌ని సీఎం చెప్పారు. ద‌ళితుడిని ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని, వారికి మూడు ఎక‌రాలు ఇస్తామ‌ని, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు క‌ట్టించి ఇస్తామ‌ని చెప్పి.. త‌ప్పించుకున్న‌వారిని తెలంగాణ స‌మాజం మ‌రిచిపోలేద‌ని వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

టాక్సిక్ ఫిక్సు… పోటీ సినిమాలకు చిక్కు

అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…

20 minutes ago

సీఐ నాగ‌రాజుకు మహిళల మద్దతు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేషన్ సీఐ నాగ‌రాజుపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే..…

31 minutes ago

హీరోయిన్ల కలెక్షన్లతో ఫ్యాన్ వార్స్ ఏంటయ్యా…

టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…

1 hour ago

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

1 hour ago

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

1 hour ago

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

2 hours ago