Political News

అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయ్‌.. మొద‌లైన ప్ర‌క్రియ‌..!

ఏపీలో అన్ని రాజ‌కీయ పార్టీలు ఎదురు చూస్తున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు సీట్ల‌ను పెంచే క్ర‌తువు ప్రారంభం కానుంది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. రాష్ట్రానికి మ‌రో 50 అసెంబ్లీ సీట్లు రావాల్సి ఉంది. ఇక‌, నియోజ‌క ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న ప్ర‌కారం.. 5-8 పార్ల‌మెంటు స్థానాలు కూడా పెర‌గాల్సి ఉంది. వీటిపై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ జ‌రుగుతున్నా.. అడుగులు ముందుకు ప‌డ‌డం లేదు. కానీ, పార్టీల‌కు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాలు పెంచితే.. త‌మకు ఇబ్బందులు త‌ప్పుతాయ‌న్న అభిప్రాయం క‌నిపిస్తోంది.

రాష్ట్రంలో నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. యువ‌త‌ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్న పార్టీలు క‌నిపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో అనూహ్య కార‌ణాల‌తో కొత్త నేత‌లు కూడా అప్ప‌టిక‌ప్పుడు పుట్టుకువ‌స్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు బాప‌ట్ల ఎంపీ.. కృష్ణ ప్ర‌సాద్ కొత్త నాయ‌కుడు. అప్ప‌టి వ‌ర‌కు రాజకీయ నేప‌థ్యం త‌క్కువే. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న టికెట్ పొందారు. దీనివ‌ల్ల‌.. సీనియ‌ర్లు, టికెట్ ఆశించిన వారు కూడా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. సిట్టింగుల‌ను త‌ప్పించారు.

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. కొత్త‌త‌రం నాయ‌కుల‌ను రాజ‌కీయాల‌కు ప‌రిచయం చేస్తోంది. దీంతో సీనియర్ల‌ను త‌ప్పించి.. సామాజిక వ‌ర్గాల ఆధారంగా టికెట్ల‌ను పంపిణీ చేసింది.ఈ రెండు పార్టీల ప‌రిస్థితి నాయకులు ఎక్కువ‌-అవ‌కాశాలు త‌క్కువ అన్న‌ట్టుగా మారింది. దీంతో వైసీపీ, టీడీపీలు రెండూ కూడా.. గ‌తంలో అధికారంలో ఉన‌ప్పుడు.. అసెంబ్లీ సీట్ల పెంపుపై క‌స‌ర‌త్తు చేశాయి. 2017-18 మ‌ధ్య చంద్ర‌బాబు దీనిపై పెద్ద తీర్మాన‌మే చేసి కేంద్రానికి ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ.. 2026 వ‌ర‌కు కుద‌ర‌ద‌ని అప్ప‌ట్లో కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఏపీ, తెలంగాణ‌ల‌కు పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అసెంబ్లీ, దేశ‌వ్యాప్తంగా జ‌నాభా ఆధారంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచేందుకు కేంద్రం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. దీనిపై పార్ల‌మెంటు ఆమోదం పొందాల్సిన నేప‌థ్యంలో శుక్ర‌వారం నుంచి ప్రారంభం కానున్న బ‌డ్జట్ స‌మావేశాల రెండో విడ‌త‌లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న‌పై ముసాయిదా బిల్లును తీసుకురానున్న‌ట్టు తెలిసింది. ఈ ప్ర‌క్రియ ఇప్పుడు మొద‌లైతే.. ఆరు మాసాల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. దీనిని తిరిగి ఈ ఏడాది ఆమోదిస్తే.. వ‌చ్చే ఏడాది నుంచి నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు.

This post was last modified on January 31, 2025 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చైనా డీప్‌సీక్‌కు మరో చైనా మోడల్ పోటీ…

చైనాలో కృత్రిమ మేధస్సు (AI) పోటీ రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. టెన్సెంట్ తాజాగా విడుదల చేసిన హున్యూయాన్ టర్బో…

4 hours ago

2029లోనూ టికెట్ కావాలంటే… ఏం చేయాలో చెప్పిన బాబు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక ఘట్టమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం శుక్రవారం పూర్తి అయ్యింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి…

6 hours ago

ఇక స్కైప్ వీడియో కాల్స్ లేనట్టే…

ఇప్పుడంటే వాట్సాప్ అందుబాటులో ఉంది కానీ, ఒకప్పుడు వీడియో కాల్స్ అనగానే స్కైప్ పేరే గుర్తుకు వచ్చేది. మొదట్లో వీడియో…

7 hours ago

మెగాస్టార్ ముందుచూపు మేలే చేసింది

తాజాగా విడుదలైన మజాకాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాని మాట వాస్తవమే కానీ నిర్మాతలు ఆశించినట్టు పికప్ కూడా వేగంగా…

7 hours ago

మిష‌న్ లేదు-మీనింగూ లేదు: ష‌ర్మిల‌

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.…

8 hours ago

కథ ఉండదు….లాజిక్స్ వెతకొద్దు – నిర్మాత నాగవంశీ

పబ్లిక్ స్టేజి మీద తమ సినిమాల గురించి నిర్మాతలు కాన్ఫిడెన్స్ తో స్టేట్మెంట్లు ఇవ్వడం సహజం. తామో గొప్ప కథను…

8 hours ago