కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు వివాదంలో చిక్కుకునేవారే. అయితే ఆ ముప్పును క్షణాల్లో గ్రహించిన ఆయన వెనువెంటనే తనను తాను సరిచేసుకుని వివాదానికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు. చాలా కాలంగా రాజకీయాల్లో సాగుతున్నా గానీ… ఎందుకనో రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. తాను టార్గెట్ చేస్తున్న పార్టీలు, నేతలు ఎవరు?.. వారి ప్రయారిటీ ఏమిటన్న దానిపై రాహుల్ అంతగా అంచనా వేయలేకపోవడమే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తాజాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ఉయభ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది కదా. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. సుదీర్ఘంగానే సాగిన తన ప్రసంగంలో రాష్ట్రపతి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత తన తల్లి సోనియా గాంధీ, పార్టీకి చెందిన ఇతర నేతలతో కలిసి రాహుల్ గాంధీ పార్లమెంటు నుంచి బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ లను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు… రాష్ట్రపతి ప్రసంగంపై వారి స్పందనను కోరారు. ఈ ప్రశ్నలకు సోనియా సిద్ధమవుతుండగానే… ఒక్కసారిగా రాహుల్ గాంధీ ‘బోరింగ్’ అంటూ సంచలన కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ నోట ఈ మాట వినిపించినంతనే మీడియా ప్రతినిధులతో పాటుగా సోనియా, కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్ తిన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంపై అలాంటి కామెంట్లు చేస్తావా? అంటూ రాహుల్ వైపు సోనియా ఒకింత కోపంగా చూసినట్టున్నారు. రాహుల్ గాంధీ వెంటనే తేరుకున్నారు. సారీ అంటూ చెప్పేసిన రాహుల్ బోరింగ్ అన్న తన వ్యాఖ్యను వెనక్కి తీసుకున్నట్లుగా వ్యవహరించారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివాదం రేగరాదన్న భావనతో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావించినట్లుగా ఉందని అన్నారు. కీలకమైన అంశాలను వదిలేసి… మోదీ సర్కారు చెప్పిన అంశాలనే రాష్ట్రపతి వల్లెవేశారని ఆరోపించారు. ఇలా మాట్లాడకుండా రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయినా… బోరింగ్ అన్న వ్యాఖ్యల వెంటనే సారీ చెప్పకపోయినా… ఈ అంశంపై పెను వివాదమే రేగి ఉండేది.
This post was last modified on January 31, 2025 3:36 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…