టీడీపీ ఏంటీ… వైసీపీతో కలిసి పోటీ చేయడమేమిటి? వైసీపీ ఏంటీ…పోయిపోయి టీడీపీతో జత కట్టడేమేమిటి?. నిజమేనండోయ్.. ఈ ఈక్వేషన్ ఊహకే అందట్లేదు. అయితే ఖమ్మం జిల్లా సారపాక వెళితే… అక్కడ ఈ రెండు పార్టీలకు చెందిన జెడాలు కలిసిమెలిసి సాగుతున్న అరుదైన దృశ్యాలను చూడవచ్చు. అక్కడి ఐటీసీ కంపెనీలో ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐఎన్టీయూసీని ఓడించేందుకు టీడీపీ కార్మిక సంఘం టీఎన్డీయూసీ… వైసీపీతో కలిసి సాగుతోంది.
ఖమ్మం జిల్లా అంటే తెలిసిందే కదా. జిల్లా తెలంగాణలో ఉన్నా… ఆంధ్రా మూలాలు బాగానే ప్రభావితం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓ ఎంపీ సీటుతో పాటు 3 అసెంబ్లీ సీట్లను గెలిచిందిక్కడే. ఆ తర్వాత 2018లో తెలంగాణ వ్యాప్తంగా ఓడినా.. టీడీపీకి రెండు అసెంబ్లీ సీట్లు కూడా దక్కింది ఈ జిల్లాలోనే. ఆ తర్వాత అటు వైసీపీ విజేతలు గానీ, ఇటు టీడీపీ విన్నర్లు గానీ…ఆ పార్టీలను వదిలివెళ్లిన సంగతి తెలిసిందే. అంటే.. ఎన్ని వేరియేషన్లు ఉన్నా… ఆంధ్రా మూలాలు ఉన్న పార్టీలకు ఈ జిల్లాలో ఇంకా అంతో ఇంతో పట్టు ఉన్నట్లే లెక్క.
ఇక సారపాక ఐటీసీ కంపెనీ విషయానికి వస్తే… కంపెనీలో మెజారిటీ కార్మికులు ఆంధ్రా మూలాలు ఉన్న వారే. కంపెనీలో మొత్తం 5 వేల మంది దాకా కార్మికులు ఉన్నా…గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వారు మాత్రం 1,253 మందే ఉన్నారట. నాలుగేళ్లకు ఓసారి ఎన్నికలు జరుగుతుండగా… గతంలో కూడా వైసీపీ మద్దతు తీసుకుని టీటీడీ విక్టరీ కొట్టేసింది. ఈ సారి కూడా అదే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తుండగా… వైసీపీ అందుకు సరేనంది. ఇంకేముంది గత ఫలితం రిపీట్ అయినట్టేనన్న ధీమాతో ఈ రెండు పార్టీలు సాగుతున్నాయి.
ఇక కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఐఎన్టీయూసీ గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా టీఎన్టీయూసీని ఓడించాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా జనసేన మద్దతుదారుల ఓట్లకు గాలం వేసింది. ఏపీలో టీడీపీతో సాగుతున్నా… కాంగ్రెస్ వ్యూహంతో ఇక్కడి జనసేన ఓట్లలో చీలిక వచ్చేసిందట. ఓ వర్గం టీడీపీతోనే ఉండగా… చీలిక వర్గం కాంగ్రెస్ తో జత కట్టిందట. పలితంగా టీడీపీ, వైసీపీ జెండాలు కలిసిపోగా… జనసేన జెండాలు మాత్రం రెండు శిబిరాల్లోనూ కనిపిస్తున్నాయి. అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరగనుంది. ఫలితం కూడా శుక్రవారం రాత్రికి విడుదల కానుంది.
This post was last modified on January 31, 2025 7:07 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…