విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో విశాక ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కానివ్వబోమని ఏపీతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి కూడా ప్రైవేటీకరణ లేదని తేల్చి చెప్పారు.
కానీ, వైసీపీ నేతలు మాత్రం అది అసత్యమంటూ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే నేడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పర్యటించిన కుమార స్వామి మరోసారి ఆ అంశంపై కీలక ప్రకటన చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని, ప్లాంట్ ను పునర్నిర్మిస్తామని తెలిపారు. విశాఖ ఉక్కును పటిష్టం చేయడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమని కుమార స్వామి తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఘనమైన చరిత్ర ఉందని, ఎన్నో పోరాటాలు, ఎంతో మంది ప్రాణ త్యాగాల కారణంగా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ప్రస్తుతం 35 వేల కోట్లు అప్పుల్లో స్టీల్ ప్లాంట్ ఉందని అన్నారు. ప్రైవేటీకరణ వద్దని సీఎం చంద్రబాబు, లోకేష్ చాలాసార్లు విజ్ఞప్తి చేశారని, తమ అభ్యర్థనలను ప్రధాని మోదీ అంగీకరించారని అన్నారు.
ఈ క్రమంలోనే మొదటి దశలో అప్పుల నుంచి బయట పడేందుకు కేంద్రం దాదాపు 11 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని చెప్పారు. ఎన్పీఏ సమస్య పరిష్కరించిన తర్వాత 2 ఫార్మేసులు సమర్ధవంతంగా నిర్వహించడంలో కార్మికులు సక్సెస్ అయ్యారని తెలిపారు.
ప్రస్తుతం స్టీల్ ప్లాంటు సమర్ధవంతంగా పనిచేస్తోందని, కార్మికుల ఇబ్బందులను 3 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ను నంబర్ వన్ ప్లాంట్ గా మారుస్తామని చెప్పారు. తమకు సహకరించమని కోరామని, అందుకు యూనియన్లు అంగీకరించాయని అన్నారు.
This post was last modified on January 30, 2025 7:29 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…