ఏపీలో వాట్పాస్ గవర్నెన్స్ ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కొత్త తరహా సేవలను ప్రారంభించారు. ఈ సేవల కోసం ప్రభుత్వం తరఫున అధికారిక వాట్సాప్ నెంబరును లోకేశ్ విడుదల చేశారు.ఆ నెంబరు 9552300009 గా లోకేశ్ ప్రకటించారు. ఈ నెంబర్ కు సందేశం పంపడం ద్వారా మనకు కావాల్సిన సేవలను ఎంచుకుని పొందవచ్చని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కొత్త సేవల గురించి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందిస్తున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు నెలకొల్పిందని,… ఈ విషయంలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందని ఆయన తెలిపారు. వాట్సాప్ గవర్నెన్న్ ను అమలు చేస్తున్న తొలి ప్రభుత్వంగా ఏపీ ప్రభుత్వం ప్రపంచంలోనే గుర్తింపు సంపాదించుకుందని ఆయన తెలిపారు.
ఈ సేవల్లో భాగంగా తొలుత 161 సేవలను అందిస్తామన్న లోకేశ్… మలి విడతలో మరో 360 సేవలను జత చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవల్లో రెవెన్యూ, మునిసిపల్, ఏపీఎస్ఆర్టీసీ, దేవాదాయ శాఖ తదితర శాఖల సేవలను తొలి దశలో అందిస్తామని తెలిపారు. చివరకు టీటీడీ సేవలను దీని ద్వారా అందజేస్తామన్నారు. ఇక ఈ సేవలను వినియోగించుకోవడం కూడా చాలా సులభమేనని కూడా లోకేశ్ వివరించారు.
అయినా వాట్సాప్ గవర్నెన్స్ నే తాము ఎందుకు ఎంచుకున్నామన్న విషయాన్ని కూడా లోకేశ్ వెల్లడించారు. వాట్సాప్ దాదాపుగా అందరూ వినియోగిస్తున్న సేవగా గుర్తించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా యువగళం పాదయాత్రలో భాగంగా సర్టిఫికెట్లను పొందడంలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించానని… ఆ ఇబ్బందిని తొలగించేందుకే ఈ కొత్త విదానానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులకు అందించే సర్టిఫికెట్ల మీద క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పిన లోకేశ్… ఆయా ప్రభుత్వ శాఖల్లో దీనిని స్కాన్ చేస్తే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. తద్వారా నకిలీలకు చెక్ పెట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.
వాట్సాప్ గవర్నెన్స్ ను ఆరు నెలల పాటు అమలు చేస్తూనే నిశితంగా పరిశీలన చేస్తామని లోకేశ్ చెప్పారు. ఆ తర్వాత ఈ సేవలను మరింత సులభతరం చేసేందుకు అవసరమైన చర్యలను చేపడతామన్నారు. ఈ సేవల వినియోగం తీరును క్లుప్తంగా వివరించిన లోకేశ్… సేవల వినియోగం సులభమేనని తెలిపారు. ఎక్కడైనా ఈ సేవలత్లో అంతరాయం కలిగితే… ప్రభుత్వం నుంచే సంబంధిత వ్యక్తులను ఫోన్ వెళుతుందని తెలిపారు. అంటే… ఈ సేవల్లో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని లోకేశ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెటా నుంచి సంద్య పాల్గొన్నారు. తన స్వస్థలం విశాఖపట్టణంగా ఆమె ఈ సందర్బంగా వెల్లడించారు.
This post was last modified on January 30, 2025 1:43 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…