ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి సర్కారు కొట్టిన దెబ్బ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బాగా గట్టిగానే తగిలింది. అప్పటిదాకా తనను ఎవరూ ఏమి చేయలేరన్నట్లుగా టేకిట్ ఈజీగా సాగిన వర్మ… సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కూడిన పోస్టుల వ్యవహారంలో ఏపీ పోలీసులు కొరడా ఝుళిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి తాను తీసుకున్న రూ.1.15 కోట్ల నిధులను తిరిగి చెల్లించాలంటూ నోటీసులు రావడం ఆయనను మరింతగా కలవరపాటుకు గురి చేసింది.
కారణమేమిటో తెలియదు గానీ… టీడీపీ పేరు విన్నా, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేరు విన్నా వర్మ భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అవకాశం చిక్కినప్పుడల్లా చంద్రబాబుపై ఆయన సెటైర్లు సంధిస్తూనే ఉంటారు. అంతేకాకుండా జనసేనాని పవన్ కల్యాణ్ అన్నా కూడా వర్మ విమర్శలు సంధిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి వర్మ దగ్గరయ్యారు. టీడీపీ, జనసేనలను గిల్లి మరీ ఏడిపించే యత్నం చేశారు.
వర్మ మార్కు జిత్తులకు బాగానే ఎంజాయి చేసిన జగన్.. వర్మకు ఆయాచిత లబ్ధి చేకూర్చారన్నది కూటమి సర్కారు ఆరోపణ. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం పేరిట వర్మ తీసిన సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లను జగన్ సర్కారు విడుదల చేసింది. తాజాగా ఈ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన టీడీపీ యువనేత జీవీ రెడ్డి… ఈ వ్యవహారాన్ని బయటకు తీశారు. ఎందుకైతే వర్మకు జగన్ హయాంలో నిధులు విడుదల చేశారో… ఆ లక్ష్యం నెరవేరలేదని తేల్చారు.
నిర్దేశించిన లక్ష్యం నెరవేరకుంటే… తీసుకున్న సొమ్మును తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సిందే కదా. అదే వాదనను బయటకు తీసిన జీవీ రెడ్డి… ఫైబర్ నెట్ నుంచి తీసుకున్న నిధులను తక్షణమే రిటర్న్ చేయాలని వర్మకు నోటీసులు పంపారట. ఈ నోటీసులకు వెంటనే స్పందించిన వర్మ… ఇప్పటికిప్పుడు అంత డబ్బు వెనక్కి ఇచ్చేయాలంటే ఎలా? ఇప్పుడు తన వద్ద అంత డబ్బు లేదు.. అంటూ బదులిచ్చారట. వర్మ ఆన్సర్ తో ఏం చేయాలో ఆలోచించిన రెడ్డి.. నిధుల చెల్లింపునకు వర్మకు 15 రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ లోగా వర్మ డబ్బు చెల్లించకుంటే,..చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. అంటే… ఈ వ్యవహారంలోనూ వర్మ జైలుకు వెళ్లే ప్రమాదం ముందు నిలిచినట్టేనా అన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
This post was last modified on January 30, 2025 12:35 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…