అన్న క్యాంటీన్… ఈ పేరు వింటేనే ఆకలి మీద ఉన్న కడుపు నిండిపోతుంది. రూ,.5 బిళ్ల పట్టుకుని అక్కడికి వెళితే…ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం అందుతుంది. అంటే…ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు కేవలం రూ.15 తో మూడు పూటలా కడుపు నింపుకోవచ్చు.
ఏపీలోని దాదాపుగా అన్ని ప్రధాన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను కూటమి సర్కారు ఏర్పాటు చేసింది. అక్కడ రుచి, శుచితో కూడిన వంటలను జనం ఇష్టంగా ఆరగిస్తున్నారు.
అయితే ఇంత మంచిగా జనం కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లకూ అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. భోజనం సరిగా లేదనో, లేదంటే పరిసరాలు శుభ్రంగా లేవనో, లేదంటే సిబ్బంది అధిక మొత్తం డబ్బు అడుగుతున్నారనో…అలా వస్తున్న విమర్శలు ఇలా వెళ్లిపోతున్నాయి.
అయితే ఇప్పుడు కొత్త తరహా ఇబ్బంది వచ్చింది. ఫుల్లుగా మందేసి వస్తున్న మందుబాబులతో అక్కడక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ తరహా ఇబ్బందికీ ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని అన్న క్యాంటీన్ల వద్ద చెక్ పడిపోయింది. నగరంలోని అన్న క్యాంటీన్ల ప్రధాన ద్వారాల పక్కన అద్దాలకు ఇప్పుడు ఓ కొత్త నోటీస్ కనిపిస్తోంది. మందు త్రాగి వచ్చిన వారికి టోకెన్ ఇవ్వబడు అంటూ రాసి ఉన్న సదరు నోటీసు మందుబాటుకు షాక్ ఇస్తోంది.
ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద ఉన్న ఈ నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on January 30, 2025 10:21 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…