యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న పవిత్ర మహాకుంభమేళాలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న తొక్కి సలాటలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో కొందరు మృత్యువాత పడ్డారు. అయితే.. ఈ ఘటన జరిగిన తర్వాత.. సుమారు 5-6 గంటల పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు కూడా.. మౌనం వహించాయి. అసలు ఏం జరిగిందన్నది.. బాహ్య ప్రపంచానికి తెలిసినా.. యూపీ సర్కారు మాత్రం తొక్కిసలాట జరిగిందని కానీ.. ఇంత మంది మృతి చెందారని కానీ చెప్పకుండా పోవడం సర్వత్రా విస్మయానికి, విమర్శలకు గురి చేసింది.
అయితే.. నలుదిక్కుల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లతో మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రధాన మంత్రినరేంద్ర మోడీ తొలిసారి మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిందని.. మృతులకు నివాళులర్పిస్తున్నానని చెప్పిన తర్వాత కానీ.. యూపీ సర్కారు నుంచి అదికారిక ప్రకటన బయటకు రాలేదు. అప్పటి వరకు `జరిగిన ఘటన` బాధాకరం అంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటిస్తూ వచ్చారు. అంతేకాదు.. వదంతులు నమ్మవద్దని, సోషల్ మీడియాలో అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి కూడా ఈ విషయం చేరిపోవడంతో చివరకు సర్కారు యదార్థాన్ని తాజాగా వివరించింది.
మహాకుంభమేళాలో ఏం జరిగిందో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డీఐజీ స్థాయి అధికారి వివరించారు. తెల్లవారు జామున 1-2 గంటల మధ్య జరిగిన ఈ తొక్కిసలాటలో మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మరో 80 మంది వరకు ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారని బుధవారం రాత్రి 7 గంటల సమయంలో డీఐజీ వివరించారు. క్రౌడ్‌ను నియంత్రించేందుకు ఏఐ తరహా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అయినప్పటికీ.. భక్తులు కోట్ల సంఖ్యలో రావడంతో సెక్టార్-2లో పరిస్థితి అదుపు తప్పిందన్నారు. మృతుల్లో 25 మందిని గుర్తించామని, మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.
మృతుల్లో తెలుగు వారు?
తొక్కిసలాటలో మృతి చెందిన వారిలో ఒకరిద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారన్న సమాచారం హల్చల్ చేస్తోంది. అయితే.. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. నిజానికి ఇప్పటి వరకు గుర్తించిన వారిలో అయితే.. తెలుగు వారు లేరని అధికారులు తెలిపారు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒకరిద్దరు మృతి చెందారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందని, అప్పటి వరకు వదంతులను నమ్మవద్దని డీఐజీ సూచించారు.
This post was last modified on January 29, 2025 10:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…