టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తగా గుర్తింపు సంపాదించుకున్నారు. 74 వయసులోనూ యమా యాక్టివ్ గా కదులుతున్న చంద్రబాబు… ఇటీవలే నాలుగో పర్యాయం సీఎం పదవిని చేపట్టారు. అటు రాజకీయాల్లో, ఇటు వ్యక్తిగతంగానూ క్రమశిక్షణతో మెలిగే చంద్రబాబు… యువ రాజకీయవేత్తలకు ఆదర్శమనే చెప్పాలి. యువ నేతలకే కాదు… ప్రధాన మంత్రి పదవిలో పదేళ్లకు పైగా నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు ఆదర్శంగా నిలిచారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్బంగా బీజేపీ తరఫున ఆ పార్టీ సీనియర్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగా ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభా వేదికపై నిలిచిన మోదీకి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువ నేత రవీంద్ర సింగ్ పాదాభివందనం చేశారు. వేదికపైకి వచ్చీరావడంతోనే మోదీ పాదాలకు సింగ్ నమస్కారం చేశారు.
అయితే ఏ ఒక్కరూ ఊహించని విధంగా మోదీ.. సింగ్ పాదాలను టచ్ చేస్తూ పాదాభివందనం చేశారు. యువకుడైన సింగ్ కాళ్లకు మోదీ మొక్కడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ విషయంలో మోదీ… చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తనకు ఎవరూ పాదాభివందనం చేయరాదంటూ చంద్రబాబు చాలా కాలం క్రితమే కోరిన సంగతి తెలిసిందే. తన మాట కాదని ఎవరైనా తనకు పాదాభివందనం చేస్తే… తాను కూడా వారికి పాదాభివందనం చేస్తానని కూడా హెచ్చరించారు. చంద్రబాబు మాటను లెక్కచేయకుండా ఇటీవల ఓ వ్యక్తి చంద్రబాబుకు పాదాభివందనం చేయగా…. ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు సదరు వ్యక్తి పాదాలను టచ్ చేసి అందరికీ షాకిచ్చారు.
ఇటీవలి కాలంలో మోదీ కూడా చంద్రబాబు మాదిరిగానే… తన పాదాలకు ఎవరూ నమస్కారం చేయవద్దని చెబుతూ వస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో ఆయన మాటను ఎవరూ లెక్క చేయడం లేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు మాదిరిగా తన పాదాలకు నమస్కారం చేసిన వారికి ప్రతిగా వారి పాదాలకు నమస్కారం చేస్తే సరిపోతుందని మోదీ భావించినట్లున్నారు. ఈ క్రమంలోనే తనకు పాదాభివందనం చేసిన సింగ్ కు మోదీ పాదాభివందనం చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
This post was last modified on January 29, 2025 10:32 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…