అదేంటో గానీ.. అధికారంలో ఉన్నంత కాలం దర్జాగా ఎంజాయి చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… అధికారం నుంచి దిగిపోయినంతనే ప్రతి చిన్న విషయంలోనూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఆ దొరకడం కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ చేతికే ఆయన చిక్కిపోతున్నారు. వెరసి ఇలా జగన్ బుక్కైన ప్రతి సారి లోకేశ్ తనదైన శైలిలో వైసీపీ అధినేతపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరో అంశంలోనూ లోకేశ్ కు జగన్ దొరికిపోయారు.
వైసీపీ పాలనలో నాడు నేడు అంటూ ప్రభుత్వ బడులను మెరుగు పరిచే కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టినట్టు జగన్ నిత్యం చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాకుడా అమ్మ ఒడి అని, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు అని, సర్కారీ బడుల్లో ఆంగ్ల మాధ్యమం అని, పిల్లలకు బైజూస్ కోచింగ్ అని, బైలింగ్యువల్ బుక్కులని… ఇలా లెక్కలేనన్ని సంస్కరణలు తీసుకుని వచ్చానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తాను చేపట్టిన సంస్కరణల ద్వారా అక్షరాస్యతలో కేరళను మించి ఏపీ ఫస్ట్ ప్లేస్ చేరుకుందని ఊదరగొట్టారు.
తాజాగా కూటమి కేబినెట్ లో విద్యా శాఖ పగ్గాలు చేపట్టిన లోకేశ్… జగన్ సంస్కరణల వల్ల సర్కారీ విద్య మెరుగుపడిందా?… లేదంటే డీలా పడిందా? అన్న దిశగా కాస్తంత లోతుగానే పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ విద్యా వ్యవస్థ స్థితిగతులపై ఏటా విడుదలవుతున్న యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ఏఎష్ఈఆర్) నివేదిక విడుదలైంది. ఈ నివేదికలో ఏపీ విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులు గణాంకాలతో సహా ఉన్నాయి. వీటిని పరిశీలించిన లోకేశ్… సర్కారీ బడులను జగన్ సర్వనాశనం చేశారని తేల్చారు. ఈ వివరాలతో లోకేశ్..జగన్ పై మరో అస్త్రాన్ని వదిలారు. జగన్ సర్కారీ బడి పిల్లలకు మేనమామ కాదని, ఆయన పిల్లల పాలిట ముమ్మాటికీ కంస మామేనని సెటైర్ సంధించారు.
ఇక జగన్ జమానాలో సర్కారీ బడుల పతనానికి సంబంధించి లోకేశ్ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే… ప్రభుత్వ బడుల్లో 6 నుంచి 14 ఏళ్ల పిల్లల హాజరు శాతం 2018లో 63.2 శాతం ఉంటే… 2024లో అది 61.8 శాతానికి పడిపోయింది. ఇక తాగునీటి సౌకర్యం ఉన్న సర్కారీ బడులు 2018లో 58.1 శాతం అయితే…2024లో అది 55.9 శాతానికి పడిపోయింది. మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న బడులు 2018లో 86.4 శాతం అయితే… 2024లో అది 78.4 శాతానికి పడిపోయింది. బడుల్లోబాలికలకు ప్రత్యేక మరుగు దొడ్లు కలిగిన పాఠశాలలు 2018లో 81.1 శాతంగా ఉంటే… 2024లో అది 77.2 శాతానికి పడిపోయింది.
This post was last modified on January 29, 2025 10:46 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…