వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కేంద్రంగా మహా కుంభమేళా కోట్లాది మంది భక్తి శ్రద్ధలతో వేడుకగా జరుగుతున్నాయి. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకుని కుంభమేళాలో పుణ్య స్నానాల కోసం కోట్లాది మంది తరలివచ్చారు. వీరిలో వీవీఐపీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఏపీకి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఉన్నారు.
మంగళవారం రాత్రికే ప్రయాగ్ రాజ్ చేరుకున్న రోజా.. బుధవారం కుంభ మేళాలో పుణ్య స్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుంభ మేళాలో మరో మహిళతో కలిసి రిక్షాపై కూర్చుని వెళుతూ రోజా కనిపించారు. ఆ తర్వాత నదిలో పుణ్య స్నానం చేస్తున్న దృశ్యాలు కూడా విడుదలయ్యాయి. ఇలా కుంభమేళాలో రోజా సంచరిస్తున్న, పుణ్య స్నానం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో వైరల్ అవుతోంది.
సరిగ్గా రోజా ప్రయాగ్ రాజ్ లో ఉన్న సమయంలోనే తొక్కిసలాట జరగడం గమనార్హం. బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయినట్లు ఉత్తర ప్రదేశ్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా మరో 90 మంది గాయపడ్డారని తెలిపింది. సరిగ్గా తొక్కిసలాట జరిగిన సమయంలో రోజా ప్రయాగ్ రాజ్ లోనే ఉన్నారు. అయితే ఆమె అక్కడి ఏ ఘాట్ లో ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. ఏదేమైనా తొక్కిసలాట జరిగిన రోజే.. రోజా అక్కడ ఉన్న వైనంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
This post was last modified on January 29, 2025 10:43 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…