ఏపీలో కూటమి సర్కారు బుధవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పోలీసు శాఖ అధిపతి (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఎల్లుండి (జనవరి 31)న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు డీజీపీగా గుప్తా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా హరీశ్ కుమార్ గుప్తా విధులు నిర్వర్తిస్తున్నారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన గుప్తా… రాష్ట్ర కేడర్ లోని ఐపీఎస్ అధికారులు అందరి కంటే సీనియర్ గా ఉన్నారు. సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చిన సీఎం నారా చంద్రబాబునాయుడు డీజీపీగా గుప్తాకే అవకాశం కల్పించారు.ఈ పోస్టుకు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యన్నార్ తీవ్ర స్థాయిలో యత్నించినా చంద్రబాబు సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన యత్నాలు ఫలించలేదు.
ఇదిలా ఉంటే,… ప్రతి ఐపీఎస్ అదికారి తమ సర్వీసులో తప్పనిసరిగా పొందాలనుకునే డీజీపీ పోస్టులో హరీశ్ కుమార్ గుప్తా కేవలం 7 నెలలు మాత్రమే కొనసాగనున్నారు. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి గుప్తా సర్వీస్ పూర్తి కానుంది. అంటే… కేవలం డీజీపీ పోస్టులో గుప్తా 7 నెలల పాటు మాత్రమే కొనసాగనున్నారు. ఇలా తక్కువ సర్వీసు ఉన్న అధికారులను అత్యున్నత స్థాయి పోస్టులకు ఎంపిక చేయరు. అయితే సీనియారిటీకే ప్రయారిటీ ఇచ్చిన చంద్రబాబు… 7 నెలల పాటే సర్వీసు ఉన్నప్పటికీ గుప్తాకే డీజీపీగా అవకాశం కల్పించారు.
This post was last modified on January 29, 2025 10:43 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…