రాంగోపాల్ వర్మ.. ఓ దర్శకుడిగా తెరకెక్కించేది క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే అయినా.. సహజంగా ఆయన చాలా భయస్తుడు. పోలీసులు, కేసులు, విచారణలు అంటే వర్మ విపరీతంగా భయపడిపోతారు. ఇందుకు ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పలు పరిణామాలే నిదర్శనం.
వైసీపీ అధికారంలో ఉండగా… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై పలు కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
ఈ కేసుల విచారణకు గాను రావాలంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసులకు వర్మ పెద్దగా స్పందించకపోవడంతో మద్దిపాడు పోలీసులు వర్మను అరెస్ట్ చేసేందుకు నేరుగా హైదరాబాద్ వెళ్లారు.
అయితే పోలీసుల రాకను గమనించిన వర్మ పత్తా లేకుండా పోయారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న ఆయన… కోర్టు ఆ మేరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసే దాకా కూడా వర్మ కనిపించ లేదు. బెయిల్ ఇచ్చినంతనే తానెక్కడికీ వెళ్లలేదని బుకాయించారు.
తాజాగా ఈ కేసులో విచారణకు రావాలంటూ మరోమారు ప్రకాశం జిల్లా పోలీసులు వర్మకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించిన వర్మ… పోలీసులు చెప్పిన ఫిబ్రవరి 4వ తేదీ కాకుండా ఫిబ్రవరి 7న విచారణకు హాజరవుతానంటూ సమాచారం ఇచ్చారట. దీంతో వర్మ చెప్పినట్లుగానే పోలీసులు ఫిబ్రవరి 7న విచారణకు రావాలంటూ మరోమారు నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో వర్మను అరెస్ట్ చేయవద్దంటూ ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు… ఆ సందర్భంగా విచారణకు సహకరించాలని వర్మకు ఆదేశాలు జారీ చేసింది., దీంతో విచారణకు హాజరు కాకపోతే ఎక్కడ తన బెయిల్ రద్దు అవుతుందోనన్న భయంతోనే వర్మ పోలీసుల విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
This post was last modified on January 29, 2025 3:21 pm
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…