ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలకు టార్గెట్ విధించారు. “ఏం తెస్తారో చూస్తా.. మీ సత్తా ఏంటో గమనిస్తా” అని ఆయన ఎంపీలను ఉద్దేశించి.. నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి కారణం.. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడుతుండడమే. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరిపేలా ఎంపీలు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే వారికి స్పష్టం చేశారు. రెండు సార్లు వారితో భేటీ అయ్యారు. ఏపీ ప్రాధాన్యాలను కూడా ఎంపీలకు వివరించారు.
అయితే.. చివరి నిముషంలోనూ బడ్జెట్‌లో మార్పులు , చేర్పులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మరోసారి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, అమలు చేయాల్సిన పథకాలు సహా.. అనేక విషయాలను వారితో చర్చించారు. ఈ క్రమంలోనే ఒక్కొక్క ఎంపీ కూడా.. తమ తమ పరిధిలో రాష్ట్రానికి మేలు జరిగేలా.. పథకాలకు సొమ్ములు అందేలా చర్యలు తీసుకుని .. బడ్జెట్ ప్రతిపాదనల్లో పెట్టేలా చూడాలని కోరారు.
ప్రస్తుతం ఒక్క రోజు మాత్రమే బడ్జెట్ ప్రతిపాదనల్లో మార్పు చేసేందుకు అవకాశం ఉన్న దరిమిలా.. చివరి నిముషాన్ని కూడా.. పక్కాగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందని.. కొన్నింటిని ప్రారంభించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు ఉన్న జిల్లాలలోని పార్లమెంటు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు.. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకోవాలని సూచించారు. బడ్జెట్ తర్వాత.. తాను అన్నీ పరిశీలిస్తానని కూడా చెప్పారు.
ఈ సందర్భంగా సైకిల్ పై పార్లమెంటుకు వెళ్తూ.. తనదైన శైలిలో ఆకట్టుకుంటున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును చంద్రబాబు అభినందించారు. తెలుగు దనాన్ని ఢిల్లీ వరకు విస్తరిస్తున్నారని ప్రశంసించారు. విజయనగరం ఎంపీగా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. విజయనగరం పార్లెమెంటు స్థానానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. కాగా.. ఈ విషయంలో ఎంపీలు ఏం చేస్తారో చూడాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు తీసుకురావడంతోపాటు.. ప్రాజెక్టులకు కూడా నిధులు తెచ్చే బాధ్యతను చంద్రబాబు వారిపైనే పెట్టారు.
This post was last modified on January 29, 2025 9:47 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…