Political News

బీజేపీ త‌ర‌ఫున బాబు ప్ర‌చారం.. ఎప్పుడు? ఎక్క‌డ‌?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వ మిత్ర‌ప‌క్షం బీజేపీకి మేలు చేసేలా.. సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. 70 స్థానాలున్న అసెంబ్లీకి వ‌చ్చే నెల 5న ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో కీల‌క పార్టీలైన ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్‌, బీజేపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారం కోల్పోకూడ‌ద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణ‌యించుకుంది. కానీ, ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని బీజేపీ నిర్ణ‌యించుకోగా.. ఈ సారైనా.. త‌మ స‌త్తా చాటాల‌ని.. పునర్ వైభ‌వం తీసుకురావాల‌ని కాంగ్రెస్ పార్టీ బావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఈ మూడు పార్టీల మ‌ధ్య ప్ర‌చారం హోరెత్తి పోతోంది. అంతేకాదు.. ఢిల్లీ ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు లెక్క‌కు మిక్కిలిగా ఉచిత హామీల‌ను గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. స‌ల‌స‌ల కాగుతున్న ఈ ప్ర‌చార ప‌ర్వంలో బీజేపీ త‌ర‌ఫున ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌చారం చేయ‌నున్నారు. గ‌త నెల‌లోనే ఆయ‌న‌కు బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. ప్ర‌చారం చేయండి బాబూ అంటూ.. పార్టీ నేత, కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా సూచించారు. అయితే.. ఢిల్లీలో అధికారంలో ఉన్న‌ది త‌న మిత్రుడు, మాజీ సీఎం కేజ్రీవాల్ పార్టీ కావ‌డంతో చంద్ర‌బాబు కొంత త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లో ప‌డ్డారు. అయితే.. ఎట్ట‌కేల‌కు బీజేపీ ఆహ్వానాన్ని మ‌న్నిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున సీఎం చంద్ర‌బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఈ నెల 31నే రాజ‌ధానికి త‌ర‌లి వెళ్ల‌నున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన తెలుగు వారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఆయ‌న ప్ర‌చారం చేయ‌నున్నారు. తెలుగు వారి విష‌యంలో చంద్ర‌బాబుకు ఉన్న క్రేజ్‌, విజ‌న్‌ను దృష్టిలో పెట్టుకుని.. వారి ఓట్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి చంద్ర‌బాబుకు బీజేపీ పెద్ద‌లు షెడ్యూల్ కూడా ఖ‌రారు చేశారు.

క‌రోల్ బాగ్, పార్ల‌మెంటు రోడ్ స‌హా.. ప‌లు ప్రాంతాల్లోని తెలుగు వారు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు ప్ర‌చారం చేస్తారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు స‌హాయ‌కారులుగా.. బీజేపీనేత‌లు ఉండ‌నున్నారు. ఇదిలావుంటే.. ఫిబ్రవరి 5వ తేదీన జ‌ర‌గ‌నున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫ‌లితాలు అదే నెల‌ 8వ తేదీన వెలువడను న్నాయి.

This post was last modified on January 29, 2025 8:12 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

4 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

6 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

8 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

8 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

10 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

12 hours ago