మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సొంత నియోజకవర్గ కేంద్రం కుప్పంలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మిస్తానని టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు చెప్పారు. కుప్పంలో పండే కూరగాయలు, పండ్లను విదేశాలకు ఎగుమతి చేసేలా అక్కడి రైతులకు ఈ ఎయిర్ పోర్టు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే చంద్రబాబు కామెంట్లను నాడు అధికారంలో ఉన్న వైసీపీ దాదాపుగా హేళన చేసింది. అయితే తాజాగా మంగళవారం జరిగిన ఓ ఘటన కుప్పంలో ఎంత త్వరగా వీలయితే.. అంత త్వరగా ఎయిర్ పోర్టును నిర్మించాలని చెప్పేసింది.
యువతలోని నైపుణ్యాన్ని వృద్ధి చేసే దిశగా సాగుతున్న 1ఎం1బీ కంపెనీకి ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఉంది. ఇప్పటికే ఈ దిశగా పలు కార్యక్రమాలను చేపట్టిన ఈ సంస్థ ఇప్పుడు కుప్పంలో గ్రీన్ స్కిల్స్ అకాడెమీ అండ్ కెరీర్ రెడీనెస్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని ఆ సంస్థ ప్రతినిధుల సమక్షంలో మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కంపెనీ కుప్పంతో పాటుగా రాయలసీమ జిల్లాలకు చెందిన దాదాపుగా 50 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. అంతేకాకుండా 30 వేల దాకా ఉద్యోగాలను అందించేందుకు తోడ్పాటు అందించనుంది. ఇక హీనపక్షం 100 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.
1ఎం1బీ కంపెనీ ఫోకస్ ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ కేంద్రంగానే సాగనుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో సమీప భవిష్యత్తుల్లోనే ఏపీ కేంద్రంగా మారనుంది. ఇప్పటికే ఈ రంగంలో ఏపీలో భారీ పెట్టుబడులు వచ్చాయి. రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో ఇప్పటికే గ్రీన్ ఎనర్జీలో భారీ ప్రాజెక్టు రాగా…ఇప్పుడు కొత్తగా విశాఖ పరిదిలోనూ అంతకంటే పెద్ద ప్రాజెక్టు రానుంది. ఈ నేపథ్యంలో కుప్పంలో కార్యాలయం తెరచిన 1ఎం1బీ కి చేతి నిండా పని ఉన్నట్లే. ఈ లెక్కన కుప్పానికి రాకపోకలు సాగించే నిపుణుల సంఖ్య ఒక్కసారిగా ఓ రేంజిలో పెరగనుంది. అంటే బాబు చెప్పినట్లుగా కుప్పంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్టు కట్టి తీరాల్సిందే. అది కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్మించక తప్పదని చెప్పాలి.
This post was last modified on January 29, 2025 8:10 am
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…