ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక… రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలి కేకలు వినిపించని రీతిలో చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.5 కే పేదలకు ఆహారాన్ని అందిస్తోంది. రోజుకు కేవలం రూ.15తో కడుపు నింపుకునే విధంగా వీటికి చంద్రబాబు సర్కారు రూపకల్పన చేసింది. చంద్రబాబు చూపిన బాటలోనే అధికార యంత్రాంగం కూడా నడుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు అధికారుల తీరుపై ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేశారు.
గుంటూరు మిర్చి యార్డు.. రెండు తెలుగు రాష్ట్రాల మిర్చి రైతులకు కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏటా సంక్రాంతి ముగియగానే యార్డుకు మిర్చి రావడం ప్రారంభమవుతుంది. జనవరి నుంచి మే నెలాఖరు దాకా ఈ సీజన్ నడుస్తుంది. దూర ప్రాంతాల నుంచి రైతులు మిర్చిని గుంటూరుకు తీసుకువస్తున్నారు. అయితే మొన్నటిదాకా యార్డులో కనీస సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడా పరిస్థితులు లేవు. భోజనంతో పాటు వసతి కూడా ఉచితంగా అందించే దిశగా యార్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాము పండించిన మిర్చిని విక్రయించేందుకు యార్డుకు వచ్చే రైతులు తమ సరుకు యార్డుకు చేరినట్టుగా రసీదు తీసుకుని…దానిని చూపితే ఉచితంగా టిఫిన్, భోజనం టోకెన్లను అందిస్తున్నారు. ఇదంతా ఉచితంగానే అందిస్తున్నారు. ఇక యార్డులోనే సేదదీరేందుకు ఏసీ సౌకర్యంతో కూడిన లాంజ్ ను ఏర్పాటు చేసిన అధికారులు.. రూ.2 తీసుకుని రైతులకు వసతి కల్పిస్తున్నారు. సోమవారం గుంటూరు మిర్చి యార్డులో ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు.. యార్డు అధికారులను అభినందించారు.
This post was last modified on January 28, 2025 5:31 pm
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…