రాజకీయాల్లో డక్కా ముక్కీలు తిన్నవారు కూడా చేయని సాహసం చేసి.. అతిపెద్ద కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన ఘనత, సొంతగా పార్టీని స్థాపించుకున్న ఘనత కూడా.. జగన్‌కు దక్కింది. సుదీర్ఘ పాదయాత్రలు, ఓదార్పు యాత్రల అనంతరం.. 2019లో అప్రతిహత విజయం అందుకుని పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. కానీ, ఐదేళ్లు తిరిగి చూసుకున్న తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఆయన ఒంటరి అవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కీలక నేతలు ఇప్పటికే పార్టీని వీడిపోగా.. వీరి జాబితాలో సాయిరెడ్డి మరో సంచలనంగా మారారు.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వి. విజయసాయిరెడ్డిని కేవలం ఓ పార్టీ నాయకుడిగా చూడలేం. ఆయనకు.. జగన్‌కు, వైఎస్ కుటుంబానికి కూడా పేగు బంధం ఉంది. రాజారెడ్డి హయాం నుంచి కూడా.. వైఎస్ కుటుంబానికి ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న సాయిరెడ్డి తర్వాత కాలంలో జగన్‌కు కుడిభుజంగా మారారనే చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో వైసీపీ పుంజుకున్నా.. జగన్‌కు-ఢిల్లీపెద్దలకు మధ్య అప్రకటిత అనుబంధం కొనసాగినా దానికి కారణం.. సాయిరెడ్డి.
వివాదం అయినా.. విజ్ఞాపన అయినా.. అంతా సాయిరెడ్డి కనుసన్నల్లోనే ఢిల్లీ రాజకీయాలు సాగాయి. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మాత్రమే కాదు.. దీనికి ముందు తర్వాత కూడా.. నిన్న మొన్నటి వరకు కూడా సాయిరెడ్డి పాత్ర ఢిల్లీలో కీలకం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ‘సాయి రెడ్డి’ అని స్వతంత్రంగా పిలుచుకునే స్థాయిలో సాయిరెడ్డి రాజకీయాలు సాగాయి. జగన్ ఢిల్లీకి వెళ్లినా.. అక్కడ చర్చలు జరిపినా.. ధర్నాలు చేసినా అంతాసాయిరెడ్డి కనుసన్నల్లోనే సాగాయి. అలా ఆయన డిల్లీ వైసీపీ రాజకీయాలను శాసించారనే చెప్పాలి.
అలాంటి సాయిరెడ్డి నిష్క్రమణతో ఇప్పుడు వైసీపీ ఢిల్లీ రాజకీయాలు డీలా పడ్డాయన్న వాదన వినిపిస్తోం ది. భాష తెలిసి ఉండడం మాత్రమే రాజకీయాలకు పరాకాష్ఠ కాదు. లాబీయింగ్ సహా.. ఎంతటి వారినైనా మెప్పించగల నేర్పు, ఒప్పించగల కూర్పు ఉన్న నాయకుడిగా సాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఇది అనేక సందర్భాల్లో సాయిరెడ్డికి మాత్రమేకాదు.. వైసీపీకి ఎంతో మేలు చేసింది. ఆయన రాజీనామా దరిమిలా.. ఢిల్లీలో వైసీపీ గ్రాఫ్ పడిపోవడమే కాకుండా.. వైసీపీ పేరు ఉనికి కూడా ప్రమాదంలో పడిందన్న జాతీయ మీడియా వాదనను తోసిపుచ్చలేం. నేతలు చాలా మంది ఉన్నా.. సాయిరెడ్డి వంటి నాయకుడు మాత్రం రాడనే అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 28, 2025 2:35 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…