Political News

రేవంత్ పిలిచారు.. చిరంజీవి వెళ్లారు రీజ‌నేంటి?!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి.. తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి మ‌ధ్య దూరం పెరిగిన విష‌యం తెలిసిందే. పుష్ప‌-2 తొక్కిస‌లాట ఘ‌ట‌న త‌ర్వాత‌.. తెలుగు సినీ ఇండ‌స్ట్రీపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు.. త‌ర్వాత ప‌రిణామాల క్ర‌మంలో ఈ గ్యాప్ పెరుగుతూ వ‌చ్చింది. అయితే.. దీనిని త‌గ్గించేందుకు నిర్మాత దిల్ రాజు ప్ర‌య‌త్నించారు. ఈ విష‌యంలో స‌క్సెస్ అయ్యారు. నిర్మాత‌లు ద‌ర్శ‌కుల‌తో ముఖ్య‌మంత్రిని క‌లుసుకుని భేటీ అయ్యేలా కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేశారు.

ఈ క్ర‌మంలో తాజాగా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్వ‌యంగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ.. సీఎంవో నుంచి చిరుకు ఆహ్వానం అంద‌డంతో హుటాహుటిన చిరు కూడా.. సీఎం రేవంత్‌తో క‌లిసి స‌ద‌రు కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం గ‌మ‌నార్హం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రొద్దుటూరులో ప్ర‌పంచ‌స్థాయి సౌక‌ర్యాల‌తో ఎకో ఫ్రెండ్లీ(ప‌ర్యావ‌ర‌ణ హిత‌) ఎక్సీపీరియం పార్కును నెలకొల్పిన సందర్భం గా సిఎం రేవంత్ తో పాటు చిరు కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.

సుమారు 150 కోట్ల రూపాయ‌ల‌తో ఏర్పాటు చేసిన ఈ పార్కును ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, చిరంజీవిలు క‌లిసి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ప్రారంభించారు. 150 ఎక‌రాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కు.. హైద‌రాబాద్ శివారు ప్రాంతానికే కాకుండా హైద‌రాబాద్కు కూడా వ‌న్నె తెస్తుంద‌ని సీఎం చెప్పారు. ఈ పార్కులో 25 వేల ర‌కాల మొక్క‌ల‌ను నాటారు. ఇప్ప‌టికే అవి గుబురుగా పెరిగాయి. అదేవిధంగా యాంపీ థియేట‌ర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్ర‌తిరోజూ సాయంత్రం ఇక్క‌డ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

This post was last modified on January 28, 2025 5:27 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

6 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

7 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

8 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago