Political News

చంద్రబాబుపై కేసులు.. పిటిషనర్ పై సుప్రీం ఫైర్!

వైసీపీ హయాంలో మాజీ సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు ఆయనపై అక్రమ కేసులు బనాయించారని టీడీపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసు మొదలు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వరకు చంద్రబాబుపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలై ఏపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టులో హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య పిటిషన్ దాఖలు చేశారు.

తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు చంద్రబాబుకు భారీ ఊరటనిచ్చింది. ఆ పిటిషన్ ను దేశపు అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. అంతేకాదు, పిటిషనర్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక పనికిమాలిన పిటిషన్, ఈ కేసు వాదించడానికి ఎలా వచ్చారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది మణిందర్ సింగ్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఫైర్ అయింది. ఇది తప్పుడు పిటిషన్ అని, ఈ పిటిషన్ గురించి ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని పిటిషనర్ ను సుప్రీం కోర్టు హెచ్చరించింది. సుప్రీం కోర్టు తాజా నిర్ణయంతో చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది.

కాగా, జగన్‌ సీఎంగా పగ్గాలు చేపట్టింది మొదలు చంద్రబాబుపై ఏకంగా 22 కేసులు నమోదయ్యాయి. 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 కేసులు పెట్టారు. మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో 2023లో రెండు, 2022లో ఒకటి, 2021లో మూడు, 2020లో రెండు మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. ఉచిత ఇసుక పాలసీలో అవకతవకల ఆరోపణల కేసు, సీఆర్‌డీఏ, రాజధాని, ఇన్నర్‌ రింగు రోడ్డు మాస్టర్‌ప్లాన్‌ నిర్ణయాల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు కేసు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, ఏపీ ఫైబర్‌నెట్‌, ఎసైన్డ్‌ భూములు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేసింది.

This post was last modified on January 28, 2025 1:11 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

6 hours ago