తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రమైనా తలసరి ఆదాయంలో మాత్రం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా టాప్ పొజిషన్ లో ఉంది. వాస్తవాలను చెప్పడంలో ఎలాంటి బేషజాలు లేకుండా వ్యవహరించే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని చాలా వేదికలపై ఇప్పటికే చాలా సార్లు చెప్పారు కూడా. అంతెందుకు మొన్నటికి మొన్నఏపీ సీఎం హోదాలో దావోస్ సదస్సుకు వెళ్లిన సందర్భంగానూ అందరి ముందే చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పారు. తెలంగాణ ఇంతగా రాణించడానికి తాను గతంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని కూడా ఆయన చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
అదేందో గానీ… రాజకీయ నేతలు ఏ విషయాన్ని అయినా తమకు అవసరమైన మేరకు మాత్రమే తీసుకుంటూ…దానికి కొనసాగింపుగా ఉన్న దానిని మాత్రం కావాలనే విస్మరిస్తున్నారు. ఈ తరహా వైఖరికి తాను ఎంతమాత్రం మినహాయింపు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మరోమారు నిరూపించుకున్నారు. మంగళవారం ఉదయమే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్… తెలంగాణ తలసరి ఆదాయంపై ఆసక్తికర పోస్ట్ చేశారు. అందులో చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్… రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడిగా పేర్కొంటూ తెలంగాణ సీఎంపై సెటైరిక్ విమర్శలు చేశారు.
అయినా సదరు పోస్ట్ లో కేటీఆర్ ఏమంటారంటే.. “దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుగారు చాలా స్పష్టంగానే చెప్పారు. గడచిన పదేళ్ల పాటు తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలే కారణమని కూడా ఆయన చెప్పారు. చంద్రబాబు గారికి ధన్యావాదాలు. దయచేసి ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి ససేమిరా అంటున్న మీ శిష్యుడికి ఈ విషయం అర్థమయ్యేలా కాస్త బోధించండి” అంటూ కేటీఆర్ సదరు పోస్ట్ లో ఆసక్తికకర వ్యాఖ్యలు చేశారు.
ఇక తన పోస్ట్ కు ఆధారం అన్న దానిని చూపించాలనుకున్నారో, ఏమో తెలియదు గానీ… సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడిన సందర్భంగా తెలంగాణ తలసరి ఆదాయం గురించి చంద్రబాబు మాట్లాడిన చిన్నపాటి వీడియోను కేటీఆర్ తన పోస్ట్ కు జత చేశారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు చాలానే మాట్లాడినా… కేటీఆర్ మాత్రం తనకు అవసరమైనంత మేరకే వీడియోను కట్ చేసి… దానిని మాత్రమే తన పోస్ట్ కు జత చేశారు. మిగిలిన వీడియోను కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే వదిలేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 28, 2025 11:13 am
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…