భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణలో రచ్చ మొదలైంది. ఈ అవార్డుల్లో భాగంగా తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యుడు నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ పురస్కారం దక్కింది. వీరిద్దరీ అవార్డులు రావడం పట్ల తెలంగాణలో హర్షం వ్యక్తం అవుతున్నా.. ఎందుకనో గానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆదివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి… పద్మ అవార్డుల విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో ఐదుగురికి అవార్డులు వస్తే..తెలంగాణలో కనీసం నాలుగు అవార్డులు అయినా రావాలి కదా అని ఆయన ఓ వింత వాదన వినిపించారు. అంతేకాకుండా పద్మ అవార్డుల కోసం తమ ప్రభుత్వం గోరటి వెంకన్న, గద్దర్, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావు వంటి వార్ల పేర్లను ప్రతిపాదించామని… వారిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా కేంద్రం అవార్డు ఇవ్వలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై తాను త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని తెలిపారు.
ఆదివారం నాటి రేవంత్ వ్యాఖ్యలపై సోమవారం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డు ఇచ్చేదే లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు గద్దర్ ఏ భావజాలంతో సాగారో మీకు తెలుసా? అంటూ కూడా ఆయన కాంగ్రెస్ ను నిలదీశారు. విధ్వంసకర భావజాలంతో సాగిన గద్దర్ చాలా మంది బీజేపీ నేతల హత్యలకు కారకులయ్యారని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేంద్ర మంత్రిగా ఉంటూ… ఇలా బహిరంగంగానే బండి సంజయ్ ఈ మేర ఆరోపణలు చేయడంపై పెద్ద రచ్చ జరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 27, 2025 1:30 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నిజంగానే ప్రతి విషయంలోనూ వెరీ వెరీ స్పెషల్ అని…
సమాజం మీద సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం పాజిటివ్ గా ఏమో కానీ నెగటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుందనే దానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ గతంలో చేపట్టిన ప్రతిష్ఠాత్మక యువగళం పాదయాత్రకు నేటితో సరిగ్గా…
వస్తువైనా సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ చాలా అవసరం. లేదంటే జనాలు పట్టించుకోకపోయే ప్రమాదముంది. ప్యాన్ ఇండియా మూవీకి…
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికంతా…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోమవారం పొద్దుపొద్దునే భారీ ఉపశమనం లభించింది. జగన్…