Political News

జగన్ కు చెప్పే రాజీనామా చేసా!

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ శుక్రవారం సాయంత్రం బాంబు లాంటి నిర్ణయాన్ని ప్రకటించిన వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి శనివారం ఉదయం తాను చెప్పినట్లుగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన సాయిరెడ్డి… తన రాజకీయ నిష్క్రమణకు సంబంధించి దారి తీసిన కారణాలను వెల్లడించారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమేనని, ఇందులో ఎలాంటి ఇతరత్రా కారణాలు లేవని కూడా ఆయన చెప్పారు. స్పీకర్ ఫార్మాట్ లోనే తాను తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని, దానిని రాజ్యసబ చైర్మన్ ఆమోదించారని సాయిరెడ్డి చెప్పారు.

తన రాజకీయ సన్యాసం గురించి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియజేసిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సాయిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని తాను నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ లండన్ లో ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలో జగన్ కు తాను ఫోన్ చేసి తన నిర్ణయం గురించి సవివరంగా చెప్పానని తెలిపారు. జగన్ కు తన నిర్ణయం గురించి చెప్పిన తర్వాతే తాను తుది నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన నిర్ణయాన్ని వాయిదా వేయాలని జగన్ చెప్పారన్నారు. రాజీనాామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారన్నారు. అయినా తాను తన నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నట్లు తెలిపానని చెప్పారు.

కాకినాడ సీ పోర్టు గురించిన వ్యవహారం కారణంగానే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. కాకినాడ సీ పోర్టు యజమాని కేవీ రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎక్కడన్నా కనిపిస్తే… నమస్కారం, ప్రతి నమస్కారం చేయడం తప్పించి…మరే ఇతర విషయాల గురించి ఆయనతో చర్చించిందే లేదన్నారు. అయినా తనను కాకినాడ పోర్టు కేసులో తనను ఏ2గా చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవీ రావుతో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు కూడా లేవన్నారు. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి తాను ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. తన వియ్యంకుడితోనూ తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని ఆయన తెలిపారు.

రాజారెడ్డి నుంచి మొదలుపెడితే.. వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత జగన్ కు ఆడిటర్ గా సేవలు అందించానని సాయిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో జగన్ కు గానీ, వైఎస్ ఫ్యామిలీకి గానీ తాను రుణపడి ఉంటానని తెలిపారు. ఇప్పటిదాకా తాను వైఎస్ ఫ్యామిలీకి ద్రోహం చేయలేదని, ఇకపైనా చేయబోనని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక వైఎస్ ఫ్యామిలీతో ఎలాంటి విభేదాలు కూడా లేవన్నారు. భవిష్యత్తులో రావన్నారు. తన పదవికి న్యాయం చేయలేనన్న భావనతోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు.

ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఒకింత ఓపిగ్గానే సమాధానం చెప్పిన సాయిరెడ్డి.. తాను వెంకటేశ్వరస్వామి భక్తుడినని, తాను ఇప్పటిదాకా అబద్ధం చెప్పలేదని, భవిష్యత్తులో అ అవసరం కూడా రాబోదని చెప్పారు. ప్రస్తుతానికి తాను రాజ్యసభ సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేశానని చెప్పిన సాయిరెడ్డి… త్వరలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనాామా చేస్తానని తెలిపారు. అప్పటిదాకా తాను వైసీపీ కార్యకర్తనేనని ఆయన అన్నారు. మీడియా రంగంలోకి అడుగుపెట్టాలని గతంలో నిర్ణయం తీసుకున్నానని, అయితే దానిపై తర్వాత పునరాలోచన చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పదే పదే ప్రశ్నలు సంధించిన మీడియా ప్రతినిధులపై సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక తనపై తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలను మాత్రం వదిలిపెట్టేది లేదని సాయిరెడ్డి శపథం చేశారు. తనకు ఓ మహిళతో వివాహేతర సంబంధాలున్నాయని కథనాలు రాసిన ఆంధ్రజ్యోతిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. ఆ సంస్థపై పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆయన తెలిపారు. ఇక కాకినాడ పోర్టు వ్యవహారంలో తనకు ప్రమేయం లేకున్నా.. తన పేరును చెప్పిన కేవీ రావును కూడా విచిడిపెట్టే ప్రసక్తే లేదని సాయిరెడ్డి తెలిపారు. తన రాజీనామా వల్ల రాష్ట్రంలోని కూటమి పార్టీలకే లబ్ధి చేకూరుతుందన్న విషయం కూడా తనకు తెలుసునని, అయినా తాను తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని తెలిపారు.

This post was last modified on January 25, 2025 12:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సీతమ్మ వాకిట్లో.. నాగ్ వాకిట నుంచే

ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…

5 hours ago

బీజేపీలో పాత సామాన్లు: రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే, వివాదాల‌కు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

8 hours ago

హీరో-డైరెక్టర్ ‘పాడు కాస్ట్’ అదిరిపోలా

కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…

9 hours ago

దేశవ్యాప్తంగా 5G.. ఏ రేంజ్ లో ఉందంటే..

భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…

10 hours ago

నా సినిమా సేఫ్ అంటున్న దర్శకుడు

‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…

10 hours ago

బాబుతో నాగం భేటీ… ఎన్నెన్ని తీపి గురుతులో?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…

11 hours ago