Political News

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ కూడా పెట్టింది.

అయితే, ఆ కమిషన్ ఏర్పాటుపై మాజీ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్య స్వామికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఆ పిటిషన్ ను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కొట్టివేసింది. దీంతో, ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కేసులో ఏపీ ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆ ప్రత్యేక కమిటీ ఓవర్‌లాపింగ్‌ కిందికి రాదని క్లారిటీనిచ్చింది.

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించడం ఏంటని సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసి పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది.

మరోవైపు, లడ్డూ వ్యవహారంపై అసెంబ్లీతోపాటు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూడా చర్చించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం నాడు శాసన సభలో ఈ విషయంపై చర్చ జరిగే అవకాశముంది.

అయితే, ఆ చర్చకు వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, మండలిలో సైతం లడ్డూ ఇష్యూపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ సూచించారట.

This post was last modified on February 23, 2026 12:41 pm

Share

Recent Posts

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

36 minutes ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

50 minutes ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

2 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

2 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

2 hours ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

3 hours ago