Political News

తాటిపర్తి వారు తగ్గేదే లే అంటున్నారే!

తాటిపర్తి చంద్రశేఖర్… వైసీపీ తరఫున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు. విద్యాధికుడు అయిన ఈయన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. సివిల్ ఇంజినీరింగ్ చదివిని ఈయన… సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటారు. తన పార్టీ ఓడిపోయినా… కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత ఘోర పరాజయం పాలైనా తాటిపర్తి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అధికార పక్షంపై నిత్యం విసుర్లు సంధిస్తూ సాగుతున్న తాటిపర్తి… విమర్శల్లో తనదైన శైలి వ్యంగ్యాన్ని మేళివిస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలతో కూడిన పోస్టులపై కూటమి సర్కారు కొరడా ఝుళిపిస్తున్నా కూడా తాటిపర్తి తగ్గేదే లే అన్నట్లుగా సాగుతున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే తన సోషల్ మీడియా పోస్టులపై తాటిపర్తి పోలీసుల నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. పోలీసుల నుంచి తాఖీదులు జారీ అయిన తర్వాతే తాటిపర్తి సోషల్ మీడియాలో మరింతగా యాక్టివేట్ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక అంశంపై పోస్టులు పెడుతున్న తాటిపర్తి… తాజాగా సీఎం నారా చంద్రబాబునాయుడు దావోస్ టూర్ పైనా సెటైరికల్ ట్వీట్ ను పోస్ట్ చేశారు.

ఈ పోస్టులో చంద్రబాబు ఆరోగ్యంపైనా కామెంట్లు చేసిన తాటిపర్తి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. టీవీ5 ఛానెల్లో జర్నలిస్టు మూర్తి చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేసిన తాటిపర్తి.. అందులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వ్యంగ్యంగా ప్రశ్నించారు. జైలులో గడిపిన తర్వాత చంద్రబాబు గుండె పరిమాణం పెరిగిందని, గుండెకు రక్తం సరఫరా చేసే రక్త నాళాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపిన విషయాన్నిఈ సందర్భంగా తాటిపర్తి గుర్తు చేశారు. అయితే గడ్డకట్టే చలిలోనూ దావోస్ లో చంద్రబాబు 24 ఏళ్ల యువకుడిగా కష్టపడుతున్నారని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. ఏదేమైనా..స్కిల్ కేసులో బెయిల్ వచ్చాక… సీఎం సీటు వచ్చాక చంద్రబాబు ఆరోగ్యం మెరుగవ్వడం తనకు ఆనందాన్ని కలిగిస్తోందంటూ ఆయన ఒకింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on January 24, 2025 1:29 pm

Share

Recent Posts

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

21 minutes ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

4 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

5 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

6 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

6 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

7 hours ago