టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి. 1985 జనవరి 23న జన్మించిన లోకేశ్.. వ్యాపార రంగంలో నిలదొక్కుకుంటారని కుటుంబం భావిస్తే.. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఆయన తన తండ్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బాటలోనే నడిచారు. తండ్రి మాదిరే రాజకీయ రంగాన్ని ఎంచుకున్న లోకేశ్… ఇప్పుడు తండ్రి కేబినెట్ లోనే మంత్రిగా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో తనదైన శైైలి దూకుడును ప్రదర్శిస్తున్న లోకేశ్… బవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగడం అయితే ఖాయమనే చెప్పాలి.
ప్రజా సేవలో లీనమైన లోకేశ్ సరిగ్గా తన బర్త్ డే నాడు కుటుంబానికి దూరంగా… రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు వెళ్లి దావోస్ లో ఉండిపోయారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పలు రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలో ఆయన క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అదే సమయంలో ఏపీలో టీడీపీ శ్రేణులు లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని, మరికొందరు అయితే ఏకంగా ఆయనను ఫ్యూచర్ సీఎం అంటూ ఎలివేషన్లు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ భవిష్యత్తుపై చంద్రబాబు తన మనసులోని మాటను బయటపెట్టేశారు. దావోస్ వేదికగా బుధవారం పలు మీడియా సంస్థలతో మాట్లాడిన చంద్రబాబు… లోకేశ్ ఫ్యూచర్ పై పదే పదే ప్రశ్నలు రావడంతో తన అంతరంగాన్ని ఆవిష్కరించేశారు.
వాస్తవానికి లోకేశ్ వ్యాపార రంగంలో స్తిర పడతారని తాను బావించానని చంద్రబాబు అన్నారు. వ్యాపార రంగం అయితేనే లోకేశ్ కు సులభంగా ఉంటుందని కూడా తాను బావించానని తెలిపారు. అయితే తన మాదిరే ప్రజా సేవ చేస్తానంటూ లోకేశ్ చెప్పారన్నారు. లోకేశ్ ఆలోచనలను తాను గౌరవించానని చంద్రబాబు తెలిపారు. దీంతో తన మాదిరే లోకేశ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అయితే ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదని ఆయన తేల్చి పారేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఏ రంగంలో అయినా అవకాశాలు వస్తుంటాయని… వాటిని అందిపుచ్చుకున్న వారే ఆయా రంగాల్లో నిలదొక్కుకుంటారని, అంతిమంగా విజేతలుగా నిలుస్తారని తెలిపారు.
ఇక తన ఫ్యూచర్ ప్లాన్లపైనా చంద్రబాబు ఓపెన్ అప్ అయిపోయారు. తానేదో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదని ఆయన తెలిపారు. లోకేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎదుగుతున్నతరుణంలో మీరు జాతీయ రాజకీయాల్లోకి వెళతారా? అంటూ మీడియా ప్రశ్నించగా… నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లి సెంట్రల్ మినిస్టర్ కావాలన్న ఆలోచన తనకు లేదని కూడా చంద్రబాబు చెప్పారు. ఇక దేశానికి హ్యాట్రిక్ పీఎంగా పదవి చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ నాలుగో దఫా కూడా పీఎం అవుతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఇలా లోకేశ్ ఫ్యూచర్ తో మొదలుపెట్టి… తన ఫ్యూచర్ ప్లాన్లను కూడా అలా ఎలాంటి మొహమాటం లేకుండా చంద్రబాబు బయటపెట్టిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
This post was last modified on January 23, 2025 9:44 am
ఎంత తలలు పండిన దర్శకులైనా రెండు మూడు హిట్లు పడ్డాక ఫ్లాపులు చూడటం సహజం. కెవి రెడ్డి, మణిరత్నం దగ్గర…
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…