నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి రికార్డు మెజారిటీ కట్టబెట్టే దిశగా లోకేశ్ వేసిన అడుగులను గుర్తు చేసుకుంటూ ఆయన అబిమానులు, టీడీపీ శ్రేణులు ఆయనను బర్త్ డే విషెస్ తో ముంచెత్తుతున్నారు. తెల్లవారక ముందే.. సోషల్ మీడియా వేదికగా లోకేశ్ కు లెక్కలేనన్ని ఖాతాల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీటిలోఒఓక దానిని పరిశీలిస్తే… “అభిమన్యుడు అనుకున్నారు..అర్జునుడివి అని తెలుసుకోలేకపోయారు” అంటూ ఓ అభిమాని లోకేశ్ ను ఆకాశానికెత్తేశాడు.
లోకేశ్ సత్తాను వివరిస్తూ సదరు అభిమాని చేసిన కామెంట్ అక్షరాలా నిజమేనని చెప్పుకొవాలి. ఎందుకంటే… 2019 ఎన్నికల్లో లోకేశ్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఓ సీఎం కుమారుడిగా, టీడీపీకి భావి అదినేతగా ప్రొజెక్ట్ అయిన లోకేశ్ ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అంతేనా… టీడీపీ కూడా గతంలో ఎన్నడూ లేనంతగా 23 సీట్లకు పరిమితమైపోయింది. ఇక ఎంపీ సీట్లలోనూ బారీ తగ్గుదల కనిపించింది. ఫలితంగా 2022 నాటికి రాజ్యసభలో సభ్యత్వం లేని పార్టీగా మారిపోయింది. టీడీపీ మళ్లీ బతికి బట్ట కడుతుందా? అన్న రీతిలో వైరి వర్గాలు హేళన చేశాయి.
అలాంటి సమయంలో యువగళం పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు లోకేశ్ శ్రీకారం చుట్టారు. అదే సమయంలో తనను ఓడించిన మంగళగిరిపై మరింత దృష్టి పెట్టారు. ఓ వైపు మంగళగిరిలో ఇంటింటికీ తనను తాను పరిచయం చేసుకుంటూనే… యువగళంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఎక్కడ టీడీపీ శ్రేణులకు ఇబ్బందులు ఎదురైనా… క్షణాల్లో అక్కడకు వెళ్లి పార్టీ శ్రేణులకు అండగా నిలిచారు. పలితంగా పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. లోకేశ్ ఉండగా…తమకు ఇబ్బందులు రావన్న నమ్మకా్ని ప్రోది చేయగలిగారు.
ఇక తన తండ్రి నారా చంద్రబాబునాయుడిని వైసీపీ సర్కారు అరెస్ట్ చేయించిన సమయంలో లోకేశ్ ధైర్యంగా నిలబడిన తీరు నిజంగానే ఆయనలోని అసలు సిసలు నాయకుడిని జనాలకు పరిచయం చేసింది. జైలులోని తండ్రి పరామర్శిస్తూనే పార్టీని ఎన్నికలకు రెడీ చేశారు. అంతేకాకుండా జనసేన, బీజేపీలతో పొత్తు కుదిరేలా చేశారు. 2024 ఎన్నికలకు గెలుపు గుర్రాలను రెడీ చేసుకున్నారు. ఎన్నికలకు నగారా మోగిన వెంటనే రంగంలోకి దిగిపోయిన లోకేశ్.. అభిమన్యుడిలా కాకుండా అర్జునుడిలా యుద్ధాన్ని గెలిచి.. ప్రత్యర్థులను చిత్తు చేశారు.
This post was last modified on January 23, 2025 9:40 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…