దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఈ సమావేశాలకు హాజరు అవుతూ పెట్టుబడుల వేటను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు సీఎంలు దావోస్‌లో సమావేశం కూడా అయ్యారు. అయితే, తాజాగా ఈ ఇద్దరితో పాటు మరో సీఎం సమావేశమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దావోస్ లో జరిగే సమావేశాలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగానే దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలిగి ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం వెళ్లారు. వేర్వేరుగా తమ రాష్ట్రాలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తదుపరి దావోస్‌లోనే జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పంచుకున్నారు.
ఈ సమావేశం అనంతరం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఓ గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సరిహద్దు రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ, తెలంగాణ, మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రబలశక్తిగా ఎదిగిన ఈ ముగ్గురు నేతలు అంతర్జాతీయ వేదికగా తమ రాష్ట్రాలకు అద్భుతమైన పెట్టుబడులు సాధించేందుకు కృషి చేస్తున్నారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. దావోస్ టూర్లో ఈ మూడు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావచ్చునని జోస్యం చెప్తున్నారు.
దాదాపుగా గత ఏడాది కాలంలోనే ఈ ముగ్గురు నేతలు తమ రాజకీయ ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రజా మద్దతుతో అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అత్యంత కీలకమైన ఎన్నికలు ఎదుర్కొని సీఎం పీఠం అధిరోహించారు. అనంతరం తమదైన శైలిలో పాలన కొనసాగిస్తూ తాజాగా దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణలో ఉన్నారు. ఈ క్రమంలోనే వీరు దిగిన ఫోటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
This post was last modified on January 22, 2025 8:45 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…