ఈటల రాజేందర్… పెద్దగా పరిచయం అక్కర్లేని నేత. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలుచుని పోరాటం చేసి… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాగానే,.. కేసీఆర్ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేత. ఆ తర్వాత కేసీఆర్ నే విభేదించిన ఈటల నేరుగా బీజేపీలో చేరిపోయారు. ఈ క్రమంలో కొన్ని ఆటుపోట్లు తగిలినా…మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీలో ఓ కీలక నేతగా కొనసాగుతున్న ఆయన మంగళవారం తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో తన మీద తానే పట్టు కోల్పోయి… ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెళ్లుమనిపించారు. ఈ సందర్బంగా ఆయన ఊగిపోయిన తీరు నివ్వెరపరుస్తోంది.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఈటల ఊగిపోతూ.. ఏకంగా చేయి చేసుకున్న దృశ్యాలతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈటల అంటేనే సాత్వికంగా, ఏది మాటాడినా సౌమ్యంగా సాగిపోయే నేతగా గుర్తింపు ఉంది. అలాంటిది సదరు వీడియోలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఆయన లంఘించిన తీరు. అతడి చెంపపై కొట్టిన తీరు, తన అనుయాయులు అతడిని చితక్కొడుతుంటే… అలా చూస్తూ నిలుచున్న తీరు నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే తాను ఓ ఎంపీని అని గుర్తుకు వచ్చిందో… ఏమో తెలియదు గానీ…ఆ తర్వాత తన అనుచరుల నుంచి రియల్ ఎస్టేట్ బ్రోకర్ ను విడిపించి… పక్కకు పంపుతున్న ఈటల దృశ్యాలు కూడా సదరు వీడియోలో కనిపిస్తున్నాయి.
ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మునిసిపాలిటి పరధిలో చోటచేసుకుంది. పోచారం మునిసిపాలిటీలో ఈటల పర్యటిస్తున్న సందర్భంగా ఓ మహిళ ఆయన వద్దకు వచ్చి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తమను ఇబ్బంది పెడుతున్నారని, తమ స్థలాలను ఏకంగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏజెంట్ల అఘాయిత్యాల గురించి మరింత మంది ఆయనకు ఫిర్యాదు చేయగా… ఈటల ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. అదే సమయంలో సదరు బ్రోకర్లు అక్కడికి దగ్గర్లోనే ఉన్నారన్న సమాచారంతో ఈటల తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. వెళ్లడం వెళ్లడమే… ఇబ్బంది పెడుతున్న బ్రోకర్ అతడేనంటూ అక్కడి జనం చూపినంతనే ఈటల అతడిపైకి ఎగబడిపోయారు. అతడి చెంప చెళ్లుమనిపించారు.
ఈటల నుంచి ఈ తరహాలో చేయి చేసుకున్నంతనే ఆయన అనుచరులు కూడా సదరు రియాల్టీ బ్రోకర్ పై లంఘించారు. ఇష్టానుసారంగా అతడిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. అయినా కూడా ఈటల అలా నిలబడి ఆ దాడిని చూస్తూ సాగారు. కాసేపటికి… తన అనుచరులను నిలువరించేలా వ్యాఖ్యలు చేసిన ఈటల…వారి చేతితో దెబ్బలు తిన్న బాధితుడిని తన వద్దకు పిలిచి… అతడి బాగోగులు ఆరా తీశారు. దాడిలో దెబ్బలు తగిలే ఉంటాయన్న భావనతో అతడి మేనిని నిమురుతూ అతడిని అలా దూరంగా పంపించివేశారు,. ఇలా ఈ మొత్తం దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో ఎంట్రీ కాగా… అది వైరల్ అవుతోంది. అంత సాఫ్ట్ గా కనిపించే ఈటల కోపం వస్తే ఇలా ఊగిపోతారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పేదలకు కష్టం వస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేతలు కూడా వాటికి ఆన్సర్లు ఇస్తున్నారు.
This post was last modified on January 21, 2025 4:02 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…