Political News

నారా లోకేష్‌… కేటీఆర్‌ను ఓవ‌ర్ టేక్ చేశారా ..!

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌.. ఓక‌ప్పుడు తెలంగాణ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ వ‌ర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పోల్చుకునేవారు. కేటీఆర్ ప‌నితీరుకు.. త‌న ప‌నితీరుకు 2014-19 మ‌ధ్య కాలంలో భేరీజు వేసుకునేవారు. అంతేకాదు.. తెలంగాణ‌లో ఐటీ శాఖ‌ను మంత్రిగా కేటీఆర్ చూసేవారు. అదే స‌మయంలో 2017-19 మ‌ధ్య మంత్రిగా ఉన్న నారా లోకేష్‌కు అప్ప‌ట్లో ఇదే శాఖ‌ను అప్ప‌గించారు. దీంతో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య పోలిక పెడుతూ.. అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

ఇక‌, ఏటా జ‌రిగే దావోస్ ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌ద‌స్సులో అప్ప‌ట్లో పోటా పోటీగా కేటీఆర్‌.. నారా లోకేష్‌లు పెట్టుబ‌డుల కోసం తీవ్రంగా శ్ర‌మించారు. మ‌రోవైపు.. బీఆర్ఎస్‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియమితులయ్యారు. ఆ క్ర‌మంలో అప్ప‌ట్లోనే టీడీపీలో నారా లోకేష్‌కు ప్రాధాన్యం పెంచాల‌న్న డిమాండ్ వినిపించింది. కొన్నాళ్లు ఆ క‌స‌ర‌త్తు కూడా జ‌రిగింది. అయితే.. త‌ర్వాత కాలంలో ఈ డిమాండ్ ప‌క్క‌కు వెళ్లినా.. త‌ర‌చుగా కేటీఆర్‌తో మాత్రం పోలిక‌లు ఉంటూనే ఉన్నాయి.

రెండోసారి వ‌రుస‌గా టీడీపీ అధికారంలోకి రాలేక‌పోయింది. ఇక‌, ఇప్పుడు కూట‌మి స‌ర్కారు ఏర్పాటు చేసుకున్న ద‌రిమిలా.. నారా లోకేష్‌కు ప్ర‌భుత్వంలో మంచి పాత్రే ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు కూడా కేటీఆర్ గురించిన ప్ర‌స్తావ‌న రావ‌డం.. ఆయ‌న‌కు నారా లోకేష్‌కు పోలిక పెట్ట‌డం రాజ‌కీయాల్లో క‌నిపిస్తోంది. ఇక‌, కేటీఆర్‌ను మా నాయ‌కుడు ఓవ‌ర్ టేక్ చేశాడంటూ.. తెలంగాణ‌కు చెందిన ఒక‌రిద్ద‌రు నాయ‌కులు తాజాగా ప్ర‌స్తావించారు. అంతేకాదు.. ఒక‌ర‌కంగా కేటీఆర్‌ను దాటేసి ముందుకు దూసుకువెళ్లిపోయార‌ని కూడా అంటున్నారు.

అటు ప్ర‌భుత్వ ప‌రంగానే కాకుండా.. ఇటు రాజ‌కీయాల ప‌రంగా కూడా నారా లోకేష్ దూకుడుగా ఉన్నారు. ముఖ్యంగా పాల‌న విష‌యంలో ఆయ‌న వేస్తున్న అడుగులు న‌భూతో అనే చెప్పాల్సి ఉంటుంది. స‌మ‌స్య లపై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందించ‌డం.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డం వంటివి క‌లిసి వ‌స్తున్న ప‌రిణామాలు. అంతేకాదు.. ప్ర‌సంగాలు, కామెంట్లు.. వంటి విష‌యాల్లోనూ నారా లోకేష్ చాలా దూకుడుగానే ఉన్నారు. తాజాగా దావోస్ స‌ద‌స్సులోనూ త‌న‌దైన శైలిని ఆయ‌న ప్ర‌ద‌ర్శించారు. ఈ ప‌రిణామాల‌తో నారా లోకేష్ వ్య‌వ‌హారంపై తెలంగాణ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 21, 2025 11:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గేమ్ చేసిన గాయం… రాజాతో మాయం

ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే టైంలో విడుదల కావడంలో ఆశ్చర్యం లేదు కానీ చాలా విషయాల్లో వాటి…

52 minutes ago

సంక్షోభానికి ఎదురీత.. ట్రంప్ ముందు స‌వాళ్లు ఎన్నెన్నో!!

అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేసిన డొనాల్డ్ ట్రంప్‌.. త‌న హ‌యాంలో దేశానికి స్వ‌ర్ణ యుగం తీసుకువ‌స్తాన‌ని ప్ర‌క‌టిం చారు.…

1 hour ago

యష్ ‘టాక్సిక్’ చుట్టూ పర్యావరణ వివాదం

కెజిఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ కి చెట్టు కష్టాలు ఎక్కువయ్యాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం. అదెలాగో…

2 hours ago

ఎట్టకేలకు ప్రక్షాళన: 27 ఐపీఎస్ లు.. 25 ఐఏఎస్ ల బదిలీలు

ముఖ్యమంత్రిగా అనుభవంతో పాటు.. ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎలా నడిపించాలన్న దాని గురించి ఎవరికైనా సలహాలు.. సూచనలు ఇవ్వొచ్చు కానీ నారా…

2 hours ago

భరత్ ‘సీఎం’ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్

ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా…

3 hours ago

దిల్ రాజు టార్గెట్ గా ఐటీ దాడులు

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే…

3 hours ago