ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా అత్యుత్సాహానికి పోతున్న తమ్ముళ్ల తీరుకు తగ్గట్లే. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస అయ్యారు. ఫ్యూచర్ సీఎం లోకేశ్ అంటూ జ్యూరిక్ లో జరిగిన ఐరోపా తెలుగు డయాస్పోరాలో వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి టీజీ భరత్ పై ఆయన సీరియస్ అయ్యారు. సమావేశం అనంతరం భరత్ ను చంద్రబాబు మందలించారు.
మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని.. ఎప్పుడు.. ఏం మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని హితవు పలికిన చంద్రబాబు.. ‘‘ఇక్కడకు మనం ఎందుకు వచ్చాం? మీరేం మాట్లాడుతున్నారు? భవిష్యత్తులో లోకేశ్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా? దావోస్ వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించటానికి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి కాదుగా?’’ అంటూ సీరియస్ అయ్యారు.
ఈ సమావేశంలో టీజీ భరత్ మాట్లాడుతూ.. ఎవరికి నచ్చినా.. నచ్చకున్నా పార్టీ భవిష్యత్తు నాయకుడిగా.. కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అంటూ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యనే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ను తెలుగు తమ్ముళ్లు తీసుకురావటం.. దీనిపై ఎవరూ మాట్లాడొద్దంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన రోజు తర్వాత.. మంత్రి టీజీ భరత్ నోటి నుంచి లోకేశ్ కాబోయే ముఖ్యమంత్రి అన్న వ్యాఖ్య రావటం సంచలనంగా మారింది. దీనికి చెక్ చెప్పేలా.. టీజీ భరత్ పై సీరియస్ అయిన చంద్రబాబు.. మున్ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేయొద్దంటూ గట్టిగా చెప్పారు. మరి.. చంద్రబాబు క్లాస్ మిగిలిన తమ్ముళ్లు అర్థం చేసుకుంటారా? లేదంటే.. టీజీ భరత్ మాదిరి తమ స్వామిభక్తిని ప్రదర్శించుకొని తిట్లు తింటారా?అన్నది చూడాలి.
This post was last modified on January 21, 2025 9:44 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…