టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున వినతులు, డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిపై ఎలా స్పందించాలో కూడా పార్టీ అధిష్ఠానానికి అర్థం కావడం లేదు. అసలే సంకీర్ణ రాజకీయాలు,…ఆపై మిత్రపక్షాలతో కలిసి ఏర్పడిన ప్రభుత్వాలు… ఇలాంటి పరిస్థితుల్లో టాప్ పోస్ట్ గురించి మిత్రపక్షాలతో సంబంధం లేకుండా ఓ పార్టీ తన సొంత నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్లగలదా? అంటే…సాధ్యం కాదనే చెప్పాలి. మరి ఈ విషయాలు పార్టీ శ్రేణులకు తెలియకపోవచ్చు. పార్టీ తరఫున ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారికి, మంత్రి పదవుల్లో కొనసాగుతున్నవారికి తెలియని విషయాలు కాదు కదా.
ఇప్పటికే లోకేశ్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వాలన్న టీడీపీ నేతల డిమాండ్లు… టీడీపీ, జనసేనల మధ్య విభేదాలను రాజేసే ప్రమాదాన్ని తెచ్చాయి. దీంతో అంటమేల్కొన్న టీడీపీ అధిష్ఠానం పార్టీ శ్రేణులకు కఠిన ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా ఇకపై డిప్యూటీ సీఎం డిమాండ్లను కట్టిపెట్టాల్సిందేనని హుకుం జారీ చేసింది. ఫలితంగా ఒక్కసారిగా ఆ డిమాండ్లు వినిపిస్తున్న నేతలంతా చల్లబడిపోయారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకుంటున్న సమయంలో… లోకేశ్ దే టాప్ పోస్ట్ అంటూ ఏకంగా ఓ మంత్రే సంచలన వ్యాఖ్య చేసి కలకలం రేపారు.
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తో కలిసి పరిశ్రల శాఖ మంత్రి హోదాలో టీజీ భరత్ కూడా స్విట్జర్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రజలతో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా లోకేశ్ ను ఆయన ఆకాశానికెత్తేశారు. అమెరికాకు చెందిన ప్రసిద్ధ స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో చదివిన నేత ఏపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు రాజ్యసభ సభ్యుల్లోనూ ఏ ఒక్కరూ లేరని భరత్ అన్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న విషయంపైనా సమగ్ర అవగాహన కలిగిన నేతగానూ లోకేశ్ తనను తాను నిరూపించుకున్నారని కూడా ఆయన తెలిపారు.
ఈ క్రమంలో ఎవరు ఔనన్నా… ఎవరు కాదన్నా…తమ భవిష్యత్తు నారా లోకేశేనని భరత్ అన్నారు. అంతటితో ఆగని ఆయన కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేశేనని కూడా సంచలన వ్యాఖ్య చేశారు. ఈ విషయం ఎవరికి నచ్చినా, ఎవరికి నచ్చకున్నా.. తమకేమీ అభ్యంతరం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో వేదికపై లోకేశ్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా అక్కడే ఉన్నారు. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వేదిక మీదే ఉన్నారు.
డిప్యూటీ సీఎంగా లోకేశ్ అంటేనే వద్దంటూ ఉంటే.. భరత్ ఏకంగా కాబోయే సీఎంగా లోకేశ్ ను ఎలివేట్ చేస్తారేమిటీ అంటూ టీడీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. అయితే అప్పటికప్పుడు భరత్ వ్యాఖ్యలను చంద్రబాబు పెద్దగా పట్టించుకోనట్టే కనిపించారు. ఈ డిమాండ్ ఎంతదాకా వెళుతుందో చూడాలి. భరత్ మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
This post was last modified on January 20, 2025 8:47 pm
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…
కొత్త ఏడాది మొదలయ్యాక సినీ ప్రియులందరి దృష్టి సంక్రాంతి చిత్రాల మీదే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో భారీ…
స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు,…