వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ చిన్న స్టాల్ ఏర్పాటు చేయాలంటేనే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిందే. పెట్టుబడులు ఆకర్షించాలంటే… సదరు స్టాళ్లు, పెవిలియన్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి. తెలుగు రాష్ట్రాలు కూడా అదే పని చేశాయి. రెండు రాష్ట్రాలు ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో ఉన్నాయి. అయినా కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇరు రాష్ట్రాలు వీలయినంత మేర కృషి చేస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన దావోస్ సదస్సుకు రెండు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి తమ తమ ప్రతినిధి బృందాలతో దావోస్ లో వాలిపోయారు.
గతంలో అయితే దావోస్ వెళ్లాలంటే,… సీఎం హోదాలో ఉన్న వారు స్పెషల్ ఫ్లైట్లు వాడేవారు. హదరాబాద్ నుంచో, విజయవాడ నుంచో నేరుగా దావోస్ చేరుకునేందుకు వారు ప్రత్యేక విమానాలు వినియోగించేవారు. ఇందుకోసం భారీ మొత్తంలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేవారు. అయితే ఈ దఫా మాత్రం స్పెషల్ ఫ్లైట్ల జాడే కనిపించలేదు. విజయవాడ నుంచి సాధారణ విమానంలో ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు… అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ లో జూరిచ్ చేరారు. ఇక దావోస్ సదస్సు కంటే ముందే… సింగపూర్ టూర్ వెళ్లిన రేవంత్ రెడ్డి కూడా స్పెషల్ ఫ్లైట్ ఏమీ వినియోగించలేదు. వెరసి ప్రజా ధనాన్ని బాగానే పొదుపు చేసినట్టు లెక్క.
ఇక సోమవారం జూరిచ్ నుంచి దావోస్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డి రైలు మార్గాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తన కేబినెట్ లోని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఎంచక్కా రైలు ఎక్కిన రేవంత్ రెడ్డి ప్రకృతి అందాలు తిలకిస్తూ… అలా ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ దావోస్ చేరుకున్నారు. జూరిచ్ నుంచి దావోస్ వరకు ఖరీదైన కార్ల ప్రయాణాన్ని రద్దు చేసుకుని ట్రైన్ జర్నీని ఎంచుకున్న రేవంత్ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అటు ఏపీ సీఎం, ఇటు తెలంగాణ సీఎం… ఇద్దరూ దావోస్ టూర్ లో పొదుపు మంత్రాన్ని పఠిస్తున్న తీరు నిజంగానే ఆహ్వానించదగ్గ పరిణామమేనని చెప్పక తప్పదు.
This post was last modified on January 20, 2025 8:43 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…