టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. అత్యధిక శాతం తెలుపు రంగు చొక్కా…నలుపు, నీలం రంగు కలగలసినట్టుండే ప్యాంటుతో కనిపించేవారు. ఎక్కడికెళ్లినా లోకేశ్ ఇదే లుక్కులో కనిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర నుంచి అయితే ఈ డ్రెస్ కోడ్ ను ఆయన తన పర్మనెంట్ డ్రెస్ కోడ్ గా ఎంచుకున్నారు. మొన్నటి అమెరికా పర్యటనలో 10 రోజుల పాటు విదేశాల్లో ఉన్నా… ఈ డ్రెస్ తప్పించి ఆయన వేరే డ్రెస లో కనిపించింది లేదు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునేందుకు సీఎం నారా చద్రబాబునాయుడితో కలిసి లోకేశ్ సోమవారం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్ నయీ లుక్కులో తళుక్కున్నారు. గ్రే కలర్ లో కనిపిస్తున్న ప్యాంట్ ను ధరిచిన లోకేశ్… దానిపై ఎరుపు రంగు చొక్కాను వేసుకున్నారు. ఈ చొక్కా కూడా ఏదో సాధారణ చొక్కాలా కాకుండా..చలికి తట్టుకునేందుకు వేసుకునే స్వెట్ షర్ట్ లా అది కనిపిస్తోంది. ఈ తరహా దుస్తుల్లో లోకేశ్ ఎప్పుడూ కనిపిచలేదనే చెప్పాలి. ఇక ఈ డ్రెస్ మీదకు లోకేశ్ స్పోర్ట్స్ షూస్ ధరించి కనిపించారు.
దావోస్ లో పలు కంపెనీల ప్రతినిధులను కలిసిన తర్వాత అక్కడి తెలుగు ప్రజలతో చంద్రబాబు బృదం మీట్ అండ్ గ్రీట్ పేరిట ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన సందర్భంగా లోకేశ్ ఈ కొత్త లుక్కులో అక్కడికి వచ్చిన వారందరినీ ఆకట్టుకున్నారు. అయితే కొత్త తరహా దుస్తులను వేసుకున్న ఆయన వాటితో కాస్తంత ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించారు. అయితేనేం… దావోస్ టూర్ పుణ్యమా అని లోకేశ్ నయా లుక్కులో టీడీపీ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచేశారు.
This post was last modified on January 20, 2025 8:50 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…
కొత్త ఏడాది మొదలయ్యాక సినీ ప్రియులందరి దృష్టి సంక్రాంతి చిత్రాల మీదే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో భారీ…
స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు,…