Political News

బాబు సీరియస్… ‘డిప్యూటీ’ డిమాండ్లకు చెక్

గడచిన రెండు, మూడు రోజులుగా ఏపీలో ఒకటే రచ్చ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కు ప్రమోషన్ ఇవ్వాలని, ఆయనకు తక్షణమే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని స్వయంగా టీడీపీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. వీటిని టీడీపీ మిత్రపక్షం జనసేన నుంచి పెద్దగా వ్యతిరేకత రాకున్నా… సోమవారం ఒక్కసారిగా జనసేనకు చెందిన కొందరు వినూత్నంగా స్పందించారు. దీంతో మేల్కొన్న టీడీపీ అధిష్ఠానం సీరియస్ గా స్పందించింది. అంతే…ఒక్కసారిగా డిప్యూటీ డిమాండ్లన్నీ చప్పున సైలెంట్ అయిపోయాయి.

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వర్థంతిని పురస్కరించుకుని కడప జిల్లాలో చంద్రబాబు పర్యటించగా… ఆ సభా వేదిక మీద నుంచే లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపించింది. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఈ డిమాండ్ ను వినిపించారు. ఏదో అభిమానంతో అలా అని ఉంటారులే అంటూ చంద్రబాబు దానిని పెద్దగా పట్టించుకోలేదు. చిన్నగా నవ్వేసి ఊరుకున్నారు. అయితే ఆ మరునాడు.. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నోట నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపించింది. ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఇదే డిమాండ్ ను వినిపించారు.

ఓ వైపు నేతల నుంచి లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ రెండు, మూడు రోజుల నుంచే వినిపిస్తున్నా… చాలా కాలంగా సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. అయినా పార్టీ అధిష్ఠానం అంతగా పట్టించుకోలేదు. అయితే నేతలు నేరుగా మీడియా ముందుకు వచ్చి ఈ డిమాండ్లు వినిపిస్తున్న వేళ… జనసేన నుంచి ఒకింత వింత వాదనలు వినిపించాయి. తాము కూడా పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా అనుకుంటున్నామని జనసేన కేడర్ ఓ ఆసక్తికర వ్యాఖ్యను చేసింది. వెరసి టీడీపీ, జనసేనల మధ్య ఓ వార్ కు రంగం సిద్ధమైపోయిందన్న సూచనలు కనిపించాయి.

ఈ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తున్న టీడీపీ అధిష్ఠానం సోమవారం ఉదయం తీవ్రంగా స్పందించింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి అంటూ డిమాండ్ చేయడం తక్షణమే మానుకోవాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని నేతలకు సూచించింది. అంతేకాకుండా ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం అంతా చూసుకుంటుందని తెలిపింది. రెండు పార్టీలతో పొత్తులో ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్ఠారాజ్యంగా ఎలా డిమాండ్లు చేస్తారని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని తెలిపింది. పొత్తు ధర్మంలో బాగంగా…మిత్రపక్షాలతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయాన్ని అయినా పార్టీ తీసుకుంటుందని, అప్పటిదాకా వ్యక్తిగత అభిప్రాయాలను బయటపెట్టుకుని… వాటిని పార్టీకి ఆపాదించవద్దని సూచించింది. ఈ దెబ్బకు టీడీపీ నేతలంతా ఉన్నపళంగా తమ నోళ్లకు తాళాలు వేసేశారు.

This post was last modified on January 20, 2025 6:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘బుల్లిరాజు’ విమర్శలకు అనిల్ సమాధానం

సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న చిత్రం.. సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి…

2 minutes ago

విశాల్ – మీనన్ : భలే కాంబినేషన్

తమిళ స్టార్ హీరో విశాల్.. ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడో పుష్కర కాలం కిందట విడుదల…

29 minutes ago

కన్నప్ప….దారిలో పడుతున్నాడప్పా !

మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఏప్రిల్ 25 విడుదల నిర్ణయంలో ఎలాంటి మార్పు…

49 minutes ago

విజయ్ దేవరకొండ 12 తెలివైన నిర్ణయం

రౌడీ బాయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ 12 విడుదల తేదీని మే 30కి లాక్ చేసినట్టు…

1 hour ago

అసలు రూపం మారిపోయిన ‘భైరవం’

ఒక రీమేక్ ఎంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శకులకు పెద్ద సవాల్ గా మారిపోయింది. ఒరిజినల్ వెర్షన్ ని సబ్ టైటిల్స్…

1 hour ago

లండన్ వీధుల్లో జాలీగా జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె గ్రాడ్యుయేషన్…

3 hours ago