ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను జనం చూసేందుకు పందేల నిర్వాహకులు బరులను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఎంత పెద్ద బరిని ఏర్పాటు చేస్తే… అందులో అంతే స్థాయిలో పందేలు జరిగాయి.
సేమ్… ఈ సూత్రాన్నే టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బాగా ఒంట బట్టించుకున్నారని చెప్పాలి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టేలా ఈ వ్యూహాన్ని ఆయన ఎంచుకున్నారు.
ఆదివారం రాత్రి గన్నవరం నుంచి చంద్రబాబు అధికారులతో కలిసి దావోస్ పయనం కాగా… లోకేశ్ మాత్రం హైదరాబాద్ నుంచి ముంబై మీదుగా దావోస్ బయలుదేరారు. తాను రచించుకున్న వ్యూహంలో భాగంగా చంద్రబాబు దావోస్ లో అడుగు పెట్టడానికి కాస్తంత ముందుగా అక్కడ వాలిపోయేందుకే లోకేశ్ ముంబై మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.
సోమవారం ఉదయం 6 గంటలకే దావోస్ సమీపంలోని జ్యూరిచ్ లో ల్యాండయ్యారు. ఆ మరుక్షణమే లోకేశ్ రంగంలోకి దిగిపోయారు కూడా.
అయినా లోకేశ్ రూపొందించుకున్న ఈ నయా వ్యూహం ఏమిటన్న విషయానికి వస్తే… సీఎం హోదాలో చంద్రబాబు దావోస్ లో వందలాది మంది పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తారు. ఆ భేటీలకు చంద్రబాబు వెళ్లేలోగానే… సదరు ప్రతినిధి బృందాలతో లోకేశ్ ముందుగానే సమావేశం అవుతారట.
అంటే… ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వం ఇవ్వనున్న రాయితీలు, అవకాశం ఉన్న రంగాలు… ఇలా ఏపీకి అనుకూలంగా ఉన్న దాదాపు అన్ని విషయాలను ఆయా బృందాలకు లోకేశ్ వివరిస్తారట. అంటే… చంద్రబాబుకు గ్రౌండ్ ప్రిపేర్ చేయడన్న మాట.
లోకేశ్ పని ముగియగానే… రంగంలోకి దిగనున్న చంద్రబాబు పెద్దగా కష్టపడకుండానే… ఆయా పారిశ్రామిక ప్రతినిధి బృందాలను ఏపీకి వచ్చేలా ఒప్పించేస్తారన్నమాట. ఇప్పటికే సింగిల్ గానే అమెరికా టూర్ వెళ్లిన లోకేశ్… తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు.
ఆ భేటీల అనుభవంతోనే లోకేశ్ ఈ నయా వ్యూహాన్ని ఎంచుకున్నట్లుగా సమాచారం. ఈ వ్యూహం పక్కాగానే వర్కవుట్ అవుతుందని, ఫలితంగా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రావడం ఖాయమేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
This post was last modified on January 20, 2025 10:09 am
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…