తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న స్థితి నుంచి సొంతంగా పగ్గాలు చేపట్టే వరకు చేరిన హస్తం పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఒకింత ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కుంటోందా? సీఎం రేవంత్ కు ఢిల్లీ పెద్దలకు గ్యాప్ విషయంలో రాష్ట్ర మంత్రులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల ప్రత్యేక సమావేశాల తర్వాత ఒకింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అంశాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం సీఎం రేవంత్ పాలనపై మంత్రులే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లిందని సమాచారం. పేరుకు పార్టీ కార్యక్రమం అయినప్పటికీ కేసీతో ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ మంత్రులు, ముఖ్యనేతలు ఈ సందర్భంగా ఒకింత రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారట. రాజకీయపరమైన అంశాలే కాకుండా పరిపాలనలో కీలకమైన బిల్లుల చెల్లింపు విషయంలో తమకు ఎదురవుతున్న సమస్యల గురించి కేసీ వేణుగోపాల్ వద్ద వాపోయారట. కొన్ని శాఖల బిల్లులు క్లియర్ అవుతున్నప్పటికీ..పలు శాఖల్లో మాత్రం బిల్లులు పెండింగ్‌లో ఉండటం తమకు అవమానంగా ఉందని ఒకింత కంప్లైంట్ రూపంలో చేరవేశారని సమాచారం.
బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేయడంతో పాటుగా సీఎం రేవంత్ వ్యవహారశైలిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారట. ఆర్థిక శాఖ మంత్రికి స్వేచ్చ ఉంది కాబట్టి బిల్లులు ఆయన్నే అడగాలంటూ సీఎం సమాధానం దాటవేస్తున్నారని, అయితే ఫైనాన్స్ మినిస్టర్ మాత్రం… ఖజానాలో నిధులు లేవని, సీఎం గారు ఆర్థిక పరమైన అంశాల్లో పరిశీలన తర్వాతే నిర్ణయం అంటూ తమతో వెల్లడిస్తున్నారని దీంతో… తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైందని మంత్రులు వాపోయినట్లు సమాచారం.
సాక్షాత్తు మంత్రులే బిల్లుల చెల్లింపు ఆలస్యం పట్ల తాము ఎదుర్కుంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టడంపై కేసీ వేణుగోపాల్ ఒకింత షాక్ అయినట్లు సమాచారం. కొన్ని శాఖలకు బిల్లులు క్లియర్ చేసి పలు శాఖల బిల్లులు పెండింగ్‌లో పెట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటకలో ఇదే రకమైన సమస్య ఎదురైనప్పుడు అన్ని శాఖలకూ నెలవారి కొంత మొత్తం కేటాయించాలనే ప్రతిపాదన తాము చేశామని… అదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా వెల్లడిస్తామని కేసీ హామీ ఇచ్చినట్లు సమాచారం.
This post was last modified on January 20, 2025 2:52 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…