తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన వైనం… ఏపీని పెను కష్టాల్లో పడేసింది. వచ్చే ఆదాయంతా తెలంగాణకు వెళ్లగా… ఆదాయ లేమితో పాటుగా అప్పుల కుప్ప నెత్తిన పెట్టుకుని ఏపీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ… ఏపీలో ఆదాయ వనరులను పెంచుకుంటూ సాగగా… ఆ తర్వాత వచ్చిన వైసీపీ సంక్షేమ పాలనకే ప్రాధాన్యం ఇచ్చింది. పలితంగా ఏపీ మరింత అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి రాష్ట్రం ఎప్పుడు అబివృద్ధి బాట పడుతుందంటూ మేథావులు ఆందోళన చెందేవారు. అయితే ఇప్పుడు వారి ఆందోళనలకు ఎండ్ కార్డ్ పడిందనే చెప్పాలి.
రెండు రోొజుల ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… ఆదివారం సాయంత్రం తన పర్యటనను ముగించుకుని ఢిల్లీ వెళ్లిపోయారు. తన టూర్ లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కృష్ణా జిల్లా కొండపావులూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి ప్రసంగించిన అమిత్ షా… ఏపీకి సంపూర్ణ భరోసా ఇచ్చారు. అభివృద్ధి పరంగా ఏపీ ప్రజలు ఇకప ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాటను ఆయన ఒకింత గట్టిగానే చెప్పారు.
తన ప్రసంగంలో ఏపీ కష్టాలను ఒకింత లోతుగానే అమిత్ షా ప్రస్తావించారు. అంతేకాకుండా వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ భారీ విధ్వంసానికి గురైందని కూడా ఆయన చెప్పారు. అయినా కూడా ఏపీ ప్రజలు భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని భరోసా ఇచ్చారు. ఎందుకంటే… ఏపీలోని కూటమి సర్కారుతో కలిసి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏపీని మూడింతల స్పీడుతో (ట్రిపుల్ స్పీడ్)తో అభివృద్ధిలో పరుగులు పెట్టేలా చేస్తామని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే గడచిన 6 నెలల వ్యవధిలోనే ఏపీకి రూ.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చేలా సహకరించామని షా తెలిపారు.
ఇప్పటికే ఆంధ్రుల ఆత్మ గౌరవంగా పరిగణిస్తున్న విశాఖ ఉక్కుకు పునరుజ్జీవం ఇచ్చేందుకు రూ.11,440 కోట్లతో రివైవల్ ప్యాకేజీ ప్రకటించామని షా తెలిపారు. ఇక రాజధాని అమరావతికి కూడా కేంద్రం ఇతోదికంగా సహకారం అందిస్తుందని ప్రకటించారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి హడ్కో నుంచి రూ.27 వేల కోట్ల మేర రుణాన్ని అందించగలిగామన్నారు. ఇక ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన మేర నిధులను అందించనున్నట్లు కూడా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఏపీకి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అండదండలు, సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ వెన్నుదన్ను నిరంతరం లభిస్తాయని కూడా ఆయన ప్రకటించారు. వెరసి ఏపీ అభివృద్ధికి అమిత్ షా కొండంత భరోసా ఇచ్చారనే చెప్పాలి.
This post was last modified on January 20, 2025 2:36 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…