Political News

బాబు అసహనంతో దిగొచ్చిన కేంద్రం…?

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కుకు నవ జీవనం ప్రసాదిస్తూ కేంద్రం ఓ భారీ రివైవల్ ప్యాకేజీ ప్రకటించిన మరునాడే… షా ఏపికి రావడంతో ఆయనకు ఏపీలోని కూటమి సర్కారు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికింది. సాంతం సంబరాల్లో జరగాల్సిన ఈ పర్యటనలో శనివారం రాత్రి ఓ అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఏపీ సమస్యలు పరిష్కరించుకునే దిశగా… కూటమి సర్కారు షా ముందు భారీ స్థాయిలో ప్రతిపాదనలు పెట్టే సమయంలో… కేంద్రం తీరుపై ఏపీ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.

శనివారం రాత్రికి షా విజయవాడ చేరుకుని… నేరుగా ఉండవల్లిలోని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికార నివాసానికి డిన్నర్ కోసం వెళ్లారు. ఈ సమయంలో చంద్రబాబు నుంచి ఓ అనూహ్య ప్రస్తావనను షా ఎదుర్కొన్నారు. కేంద్రం తీరు ఇలా ఉంటే… తాము ముందుకెలా సాగుతామంటూ చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తాను వచ్చిన వేళ… సంతోషించాల్సిన చంద్రబాబు ఇలా అసహనం వ్యక్తం చేయడమేమిటన్న కోణంలో షా కూడా ఒకితం షాక్ కు గురయ్యారనే చెప్పాలి. చంద్రబాబు అసహనానికి గల కారణాన్ని తెలుసుకున్న షా.,.. వెనువెంటనే బాబు కోపాన్ని తగ్గించేలా కీలక ఆదేశాలు జారీ చేశారు.

అయినా ఏం జరిగిందన్న విషయానికి వస్తే… తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట, దానిని మరువకముందే తిరుపతిలో జరిగిన అగ్ని ప్రమాదాలపై కేంద్రం దృష్టి సారించింది. వరుస ఘటనల నేపథ్యంలో అసలు తిరుపతిలో ఏం జరుగుతోందంటూ ఆరా తీసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్వి సంజీవ్ కుమార్ జిందాల్ ను తిరుమల పంపించి..టీటీడీ అదికారులతో సమీక్షించాలని తీర్మానించింది. ఇందుకోసం అప్పటికప్పుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఓ లేఖ రాసింది. జిందాల్ విచారణకు సహకరించాలని అందులో ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయం తెలిసినంతనే చంద్రబాబు అసహనానికి గురయ్యారట. కేంద్ర హోం మంత్రి తొలి సారి రాష్ట్ర పర్యటనకు వస్తున్న సమయంలో ఆ శాఖే అతి చేస్తూ ఈ లేఖ రాయడమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పటిదాకా టీటీడీ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకున్న దాఖలా లేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని నేరుగా షా వద్దే తేల్చుకోవాలని కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా షా వద్ద ఈ విషయాన్ని ఎలా ప్రస్తావించాలన్న దానిపై ఆయన ముందుగానే కార్యాచరణ రూపొందించుకున్నట్లు సమాచారం.

తన ఇంటికి షా రాగానే… పసందైన విందును ఆయనకు చంద్రబాబు అందించారు. ఆ తర్వాత షాతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సమయంలో టీటీడీపై కేంద్రం సమీక్షను చంద్రబాబు ప్రస్తావించారు. తొక్కిసలాటపై ఇప్పటికే తాము వేగంగా స్పందించి… బాధ్యులపై చర్యలు తీసుకున్నామని, తిరుమలలో పటిష్ట చర్యలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇలాంటి సమయంలో కేంద్రం సమీక్ష ఏమిటని ఆయన ప్రశ్నించారట. దీంతో విషయం తీవ్రతను పసిగట్టిన షా… అక్కడిక్కడే ఫోన్ తీసుకుని… జిందాల్ తిరుమల టూర్ ను రద్దు చేయాలని అదికారులకు ఆదేశాలు జారీ చేశారట. క్షణాల్లో సమస్యను పరిష్కరించిన షాకు థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఇతరత్రా విషయాలపై దృష్టి సారించారట.

This post was last modified on January 20, 2025 2:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగిల్ డే… జగన్ కు డబుల్ స్ట్రోక్స్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…

22 minutes ago

అవకాశాలు వదిలేస్తున్న విశ్వంభర

జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…

56 minutes ago

చంద్ర‌బాబు.. ఎస్టీల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌…!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజ‌న ప్రాబ‌ల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీల‌కు భారీ మేలును…

1 hour ago

మహానాడులో మార్పు లేదు..

ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…

1 hour ago

కోర్ట్ దర్శకుడు…సీతారామం హీరో !

ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…

4 hours ago

భయంకర ఉగ్రవాదికి నష్టపరిహారమా..?

ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…

6 hours ago