దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త ప్లాంట్ ను ఏక్కడ ఏర్పాటు చేస్తుందన్నది ఈ చర్చల సారాంశం. ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్… హెచ్125 హెలికాఫ్టర్ల తయారీ కోసం భారత్ లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్ కు భారత్ ను అయితే ఎంచుకున్న ఎయిర్ బస్… భారత్ లో ఎక్కడ పెట్టాలన్న దానిపై ఇంకా ఓ నిర్ణయం అయితే తీసుకోలేదు. దేశంలోని పలు ప్రాంతాలను ఆ సంస్థ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఎయిర్ బస్ తన కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ప్రధానంగా నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వాటిలో ఏపీతో పాటు కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్ ప్రదాని మోదీ సొంత రాష్ట్రమైతే… ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కీలకమైనది. ఇక కర్ణాటక ఏవియేషన్ రంగానికి అనుకూలమైన రాష్ట్రంగా పేరు గడించింది. మరి ఏపీ ఏ రీతిన ఈ జాబితాలోకి చేరిందంటే… ఏపీలోని అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ యూనిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. కియా ప్లాంట్ తో అటు అనంతపురం జిల్లాతో పాటుగా ఏపీ కూడా వరల్డ్ టాప్ కంపెనీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
రాయలసీమలోని అత్యంత ఎడారి జిల్లాగా పేరున్న అనంతపురంలో ఏ కంపెనీ తన ప్లాంట్ ను పెట్టాలన్నా… అవసరమైన మేర భూమి ఇట్టే దొరికిపోతుంది. మానవ వనరుల విషయంలోనూ మాన్యూఫ్యాక్చరింగ్ యూనిట్లకు అనంత ఓ అవకాశాల గని కిందే లెక్క. జిల్లాలో ఇటీవలి కాలంలో పెరిగిన నీటి లభ్యత కూడా ఆహ్వానించదగ్గ పరిణామమేనని చెప్పాలి. తక్కువ ధరలకే భూమి లభిస్తుండటంతో ఆటోమొబైల్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనంత జిల్లానే ప్రిఫర్ చేస్తోంది.
ఈ క్రమంలో ఎయిర్ బస్ ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఓ దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో ఎయిర్ బస్ యూనిట్ కోసం అవసరమైన మేర భూములు ఎక్కడ ఉన్నాయో చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఎయిర్ బస్ తో చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న నేపథ్యంలో ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు విడుదల కాలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లుగా… ఎయిర్ బస్ అనంతకు వస్తే… జిల్లా రూపురేఖలు మారిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
This post was last modified on January 19, 2025 10:52 pm
ఇటీవలే విడుదలైన వీరధీరశూర పార్ట్ 2కు పాజిటివ్ టాక్, రివ్యూస్ వచ్చిన మాట వాస్తవం. చూసింది తక్కువ ప్రేక్షకులే అయినా…
మాస్ రాజా రవితేజకు ఇప్పుడు అత్యవసరంగా ఒక పెద్ద హిట్ అవసరం. గత ఏడాది ఆయన్నుంచి వచ్చిన ‘ఈగల్’, ‘మిస్టర్…
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చిందని అంతా అనుకుంటున్నారు గానీ… చూస్తుంటే ఇంకా చాలా కసరత్తే జరుగుతున్నట్లుగా ఉంది.…
ఆయన కోటీశ్వరుడి కుమారుడు. ఎండకన్నెరుగని ఫ్యామిలీ. అయితే.. ఇప్పుడు కారణాలు ఏవైనా.. కాలినడక పట్టారు. ఏకంగా.. 140 కిలో మీటర్ల…
సినిమాలతో ఎంటర్ టైన్ చేయడంలోనే కాదు ప్రమోషన్ల విషయంలోనూ దర్శకుడు అనిల్ రావిపూడిది ప్రత్యేక ముద్ర. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాంని…
"కొందరు చెబుతారు.. మాట ఇచ్చాను.. అన్నీ చేసేస్తామని.. కానీ, వాళ్లు ఏం చేశారో.. అందరికీ తెలుసు. మడమా.. కాలు అన్నీ…