ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు పలు విజ్ఞాపలు, విన్నపాలు వినిపించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇరువురు అంతర్గతంగా సంభా షించుకున్నట్టు తెలిసింది. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొనలేదని సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ-ఏపీ మధ్య ఉన్న విభేదాలపైనే ఎక్కువగా చంద్రబాబు ఫోకస్ చేశారని తెలిసింది. ప్రస్తుతం నదుల అనుసంధానాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
రాజస్థాన్‌లో ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలోని బనకచర్ల వరకు కృష్ణా, గోదావరి, పెన్నా నదుల జలాలనుతీసుకువెళ్లే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తెలంగాణ దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. మరో వివాదానికి కాలు దువ్వుతోంది. బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి లేఖలు సంధించారు. దీనిపై సీఎం చంద్రబాబు అమిత్ షాకు కూలంకషంగా వివరించారని సమాచారం.
ఈ నదుల అనుసంధానంతో కరువు సీమకు నీరు అందుతాయని.. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని అమిత్‌షాకు విన్నవించినట్టు తెలిసింది. అదేవిధంగా కేంద్రం ప్రతిపాదించిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్-2పై పునః సమీక్ష చేయాలని.. న్యాయ పరంగా కంటే.. దౌత్య పరంగా ఈ సమస్య పరిష్కారం అయితే..ఏపీకి మేలు జరుగుతుందనికూడా ఆయన చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల వ్యవహారం కూడా.. ప్రస్తావనకు వచ్చినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
నామినేటెడ్ పదవుల విషయంలో తమ మిత్రపక్షం బీజేపీకి న్యాయం చేస్తున్నామని చంద్రబాబు చెప్పగా.. ఈ విషయంలో తాము సంతృప్తిగానే ఉన్నామని, అయితే.. క్షేత్రస్తాయిలో కొంత అసంతృప్తి ఉందని.. దానిని తగ్గించే ప్రయత్నం చేయాలని అమిత్‌షా సూచించినట్టు సమాచారం. ఇక, పోలవరం పనులు, విశాఖ రైల్వే జోన్, స్టీల్‌ప్లాంటు నిధుల పై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారని తెలిసింది. ప్రస్తుతం కూటమి సర్కారు పాలనపై.. అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. పాలన బాగుందని.. జీడీపీ పెంచుకునేలా ప్రయత్నాలుచేయాలని ఆయన సూచించినట్టు సమాచారం.
This post was last modified on January 19, 2025 8:45 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…