కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ లోని కూటమి సర్కారు భారీ ఎత్తున స్వాగతం పలికింది. విశాఖ ఉక్కుకు కేంద్రం బారీ ప్యాకేజీ ప్రకటించిన మరునాడే అమిత్ షా ఏపికి రావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రజలు కూడా షా టూర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. షాకు ఏ రేంజిలో స్వాగతం పలికినా తప్పు లేదన్న వాదనలూ వినిపించాయి. అందుకే కాబోలు… షాకు స్వగతం పలికేందుకు ఏపీ కేబినెట్ గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలివెళ్లింది.
కూటమి సర్కారు పలికిన స్వాగత సత్కారాలతో ఖుషీ అయిన షా.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికార నివాసానికి వెళ్లారు. రోడ్డు మార్గం మాదుగా షా వెళ్లగా…దారి వెంట ఆయనకు టీడీపీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు నివాసంలో బాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, శ్రీనివాస రాజు, ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాలు పంచుకున్నారు.
ఇదిలా ఉంటే… అమిత్ షాకు చంద్రబాబు తన నివాసంలో హై లెవెల్ డిన్నర్ ఇచ్చారు. ఈ విందు తర్వాత పవన్ తో కలిసి అమిత్ షాతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పురంధేశ్వరి, లోకేశ్ కూడా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇచ్చే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏపీకి రాజకీయాలను మలుపు తిప్పిన నేతగా ఎన్టీఆర్ కు గుర్తింపు ఉందని చంద్రబాబు చెప్పగా… ఎన్టీఆర్ గురించి తనకూ తెలుసునని, భారత రత్నకు ఎన్టీఆర్ అర్హులేనని షా బదులిచ్చారట.
ఈ సందర్బంగా తెలుగు నేలకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును గుర్తించిన కేంద్రం ఎన్టీఆర్ ను గుర్తించకపోవడం బాధగా ఉందని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా పీవీ కూడా ఏపీకి సీఎంగా పనిచేశారని చంద్రబాబు అనగా… సీఎంగా పీవీ ఎంతకాలం పనిచేశారంటూ షా ఆరా తీశారు. దీంతో కేవలం 15 నెలలు మాత్రమే పీవీ సీఎంగా పనిచేశారని, నాడు కాంగ్రెస్ పార్టీ నిత్యం సీఎంలను మారుస్తూ సాగిన వైనాన్ని ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక కాలం సీఎంగా పనిచేసింది ఎవరు? అంటూ షా ఆరా తీశారు. దీంతో ఏమాత్రం తడుముకోని చంద్రబాబు… దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డేనని తెలిపారు. వైఎస్ ఏకంగా ఆరేళ్లపాటు సీఎంగా పనిచేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ఒకింత ఎక్కువ కాలమే సీఎంగా పనిచేశారని తెలిపారు.
మొత్తంగా ఎన్టీఆర్ కు భారత రత్న అంశంపై చర్చ సందర్భంగా చంద్రబాబు నోట నుంచి వైఎస్ పేరు వినిపించడం నిజంగానే ఆసక్తి రేకెత్తించింది. ఇటు చంద్రబాబుతో పాటు అటు వైఎస్ కూడా… ఇద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి విజయం సాధించి… ఇద్దరూ ఒకే సారి అసెంబ్లీలో అడుగు పెట్టి…ఇద్దరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడే మంత్రి పదవులు చేపట్టి…కొంతకాలం పాటు మంచి స్నేహితులుగానూ సాగారు. ఇప్పుడు వైఎస్ లేకున్నా… చంద్రబాబు నోట ఆయన పేరు వినిపించడం.. అది కూడా అమిత్ షా వంటి నేతలతో భేటీలో ఈ అంశం ప్రస్తావనకు రావడం నిజంగానే ఆశ్చర్యకరమే.
This post was last modified on January 19, 2025 8:23 am
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ…
ఇప్పుడంతా టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి నడుస్తోంది. హిట్ టాక్ తో రెండు దూసుకుపోతున్నా బాక్సాఫీస్ డామినేషన్ మాత్రం పూర్తిగా…