ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో కీలక విభాగం అయిన సీఐడీకి చీఫ్ గా వ్యవరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై విచారణకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఏపీ మంత్రిమండలి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకోసం ఇద్దరు సీనియర్ అధికారులతో కూడిన అథారిటీని ఏర్పాటు చేసింది.
జగన్ సీఎంగా ఉండగా… సీఐడీ చీఫ్ గా పనిచేసిన సునీల్ నాటి ప్రభుత్వం చెప్పినట్టు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం నిబంధనలను సైతం ఆయన పక్కనపెట్టేశారని కూడా విమర్శలు వినిపించాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాకృష్ణరాజు నాడు నరసాపురం ఎంపీగా కొనసాగిన సంగతి తెలిసిందే. జగన్ సర్కారు ఆదేశాలతో రఘురామను అరెస్ట్ చేసిన సీఐడీ.. ఆయనను తమ కస్టడీలో టార్చర్ చేసినట్లుగా వార్తలు రాగా..దానిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది.
ఈ కేసులో సునీల్ కీలకంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలున్నాయి. సునీల్ ఆదేశాలతోనే సీఐడీ అధికారులు రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా సునీల్ కు సన్నిహితంగా కొనసాగిన ప్రైవేట్ వ్యక్తి తులసిబాబును రఘురామ గుండెలపై కూర్చోబెట్టి… మాజీ ఎంపీని చంపేయాలని చూశారని కూడా ఆరోపణలున్నాయి. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలున్న సీఐడీ అధికారి విజయ్ పాల్ తో పాటుగా తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇటు విజయ్ పాల్ తో పాటుగా అటు తులసిబాబును రోజుల తరబడి విచారించిన పోలీసులు.. ఈ కేసులో సునీల్ ప్రత్యక్ష పాత్రను నిర్ధారించుకున్న తర్వాతే… ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. ఈ విచారణ అథారిటిలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాతో పాటుగా సీనియర్ ఐపీఎస్ అదికారి హరీశ్ కుమార్ గుప్తాలను ప్రభుత్వం నియమించింది. నిర్ణీత గడువులోగా విచారణను పూర్తి చేసి నివేదికను అందించాలని అథారిటీని ఆదేశించింది.
సునీల్ తర్వాత సీఐడీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి… జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారని ఆరోపణలు ఎదర్కొన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ పై ఇప్పటికే విచారణ పూర్తి కాగా.. ఆయనపై ఏకంగా కేసులు కూడా నమోదు అయ్యాయి. తాజాగా సునీల్ పైనా విచారణ షురూ కావడంతో వైైసీపీ జమానాలో సీఐడీ చీఫ్ లుగా వ్యవహరించిన ఇద్దరిపైనా చర్యలు తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే…అటు సంజయ్, ఇటు సునీల్…ఇద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.
This post was last modified on January 18, 2025 12:38 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…